Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadసిటీ సెంట్ర‌ల్ లైబ్ర‌రీలో బాబూ జ‌గ్జీవ‌న్‌రామ్ జ‌యంతి

సిటీ సెంట్ర‌ల్ లైబ్ర‌రీలో బాబూ జ‌గ్జీవ‌న్‌రామ్ జ‌యంతి

📰 Generate e-Paper Clip

 

హైదరాబాద్, ఏప్రిల్ 5, అద్దం న్యూస్ :    భారతరత్న బాబు జగ్జీవ‌న్‌రామ్‌ జయంతి కార్య‌క్ర‌మం శ‌నివారం శ‌నివారం హైద‌రాబాద్ న‌గ‌ర కేంద్ర గ్రంథాల‌యంలో ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేసిరెడ్డి ఉపేంద‌ర్‌రెడ్డి హాజ‌రై బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… ‘బాబుజీ’ అని ముద్దుగా పిలువబడే బాబు జగ్జీవ‌న్‌రామ్‌ సామాజిక న్యాయం, అణగారిన వర్గాల, ముఖ్యంగా దళిత సమాజం అభ్యున్నతికి ఆయన జీవితాంతం అంకితభావం భారతదేశ సామాజిక-రాజకీయ దృశ్యంపై చెరగని ముద్ర వేసిందన్నారు. స్వాతంత్య్రం సమరయోధుడు, అనుభవజ్ఞుడైన పార్లమెంటేరియన్, డైనమిక్ అడ్మినిస్ట్రేటర్ పాత్రను నొక్కి చెప్పారు. రక్షణ, వ్యవసాయం, కార్మిక సహా వివిధ మంత్రిత్వ శాఖలకు ఆయన చేసిన గణనీయమైన సహకారాన్ని వారు గుర్తు చేశారు. కుల ఆధారిత వివక్షను నిర్మూలించడానికి, సమ్మిళితత్వాన్ని ప్రోత్సహించడానికి ఆయన కృషి చేశార‌న్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page