జలమండలిలో బాబు జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలు
హైదరాబాద్, అద్దం న్యూస్ : భారత స్వాతంత్య్ర సమర యోధుడు, మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జయంతిని శనివారం జలమండలిలో ఘనంగా నిర్వహించారు. ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ వేడుకలకు ఎండీ అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జగ్జీవన్‌రామ్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎండి అశోక్‌రెడ్డి మాట్లాడుతూ… స్వాతంత్య్ర సమరయోధుడిగా, సంఘ సంస్కర్తగా, రాజకీయవేత్తగా ఆయన దేశానికి విశేష సేవలందించారని కొనియాడారు. అలాగే కేంద్ర మంత్రిగా, దేశ ఉప ప్రధానమంత్రిగా డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్ దేశంలోని షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల హక్కులు, అభివృద్ధి కోసం తీవ్రంగా కృషి చేశారని అన్నారు. మనం సైతం ఎంతో మంది మహానుభావులను స్ఫూర్తిగా తీసుకుని వారి ఆశయ సాధన కోసం పని చేయాలని పేర్కొన్నారు. అనంతరం ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ యూనియన్ నాయకులు జలమండలి ప్రధాన కార్యాలయం నుంచి ఎల్‌బి స్టేడియం వద్దనున్న జగ్జీవన్ రామ్ విగ్రహం వరకు చేపట్టిన ర్యాలీని ఎండీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జలమండలి ఈఎన్‌సీ- ఆపరేషన్స్ -2 డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్ కుమార్, టెక్నికల్ డైరెక్టర్ సుదర్శన్, ఆపరేషన్స్ -1 డైరెక్టర్ అమరేందర్ రెడ్డి, ఫైనాన్స్ డైరెక్టర్ పద్మావతి, కార్యక్రమం కో– ఆర్డినేటర్ సీజీఎం పద్మజ, సీజీఎంలు మహ్మద్ అబ్దుల్ ఖాదర్, వినోద్ భార్గవ, ప్రభు, నాగేందర్, చంద్ర జ్యోతి, కేదారేశ్వరి, జీఎంలు, జలమండలి ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ యూనియన్ల నాయకులు, కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply