తెలంగాణ సహాయ నిధికి విరాళాన్ని ప్రకటించి ఉదారత చాటుకున్న బాలక్రిష్ణ
– టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా

హైదరాబాద్, ఆగస్టు 31, అద్దం న్యూస్ : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారి ఈ అడుగు జాతుల్లో నడుస్తూ ఆయన దాతృత్వాన్ని పునికి పుచ్చుకొన్న అగ్రశ్రేణి కథానాయకుడు భాలకృష్ణ మరోసారి తన ఉదారత చాటుకుని తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారని టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా అన్నారు. ఆదివారం హైదరాబాద్ దోమలగూడలోని నగర టిడిపి కార్యాలయంలో జరిగిన సమావేశంలో సాయిబాబా మాట్లాడుతూ… తెలంగాణలో గత కొద్ది రోజులుగా కురిస్తున్న భారీ వర్షాల వల్ల అనేక ప్రాంతాలు జలమయమయి దెబ్బతిన్నాయన్నారు. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో వరదల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, చాలా వరకు పల్లెలు జలమయమయ్యాయి, ఎంతో మంది తమ ఇళ్లు కోల్పోయారన్నారు. మరి కొందరు ఆహారం, తాగునీటి కోసం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కష్టకాలంలో బాధితులకు అండగా నిలిచేందుకు సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ముందుకు వచ్చి కకావికలమైన కామారెడ్డికి అండగా నిలిచారన్నారు. వరద ధాటికి సర్వం కోల్పొయిన బాధితుల సహాయార్థం 50 లక్షల విరాళాన్ని తెలంగాణ సీఎం సహాయనిధికి ప్రకటించారన్నారు. కేవలం విరాళం ఇచ్చి వెనక్కు తగ్గను, ఇంకా మున్ముందు కూడా వారిని పూర్తి స్థాయిలో ఆదుకునేందుకు ముందుంటానని బాలక్రిష్ణ స్పష్టం చేశారని సాయిబాబా తెలిపారు.
అదే విధంగా ఈ విపత్కర పరిస్థితుల్లో బాలకృష్ణను స్ఫూర్తిగా తీసుకొని మరి కొంత మంది సినీ ప్రముఖులు. ప్రజా నాయకులు, సమాజంలోని ఇతర ప్రముఖులు, పెద్దలు ముందుకు వచ్చి ఇటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి ముందుకు రావాలని సాయిబాబా అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నల్లెల్ల కిషోర్, పి.బాలరాజు గౌడ్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply