చేనేత రంగంలో సేవలందించిన ప్ర‌ముఖుల‌ను సన్మానించిన బండారు ద‌త్తాత్రేయ‌

చేనేత రంగంలో సేవలందించిన ప్ర‌ముఖుల‌ను సన్మానించిన బండారు ద‌త్తాత్రేయ‌ 

హైదరాబాద్, ఆగ‌స్టు 07, అద్దం న్యూస్ :   జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా, తమ శ్రమతో, నైపుణ్యంతో, నిబద్ధతతో చేనేత కళను విశ్వవ్యాప్తం చేసి, చేనేత రంగంలో విశేష సేవలందించిన ప్రముఖులని మాజీ గ‌వ‌ర్న‌ర్ బండారు దత్తాత్రేయ స‌న్మానించారు. గురువారం హైద‌రాబాద్ రాంన‌గ‌ర్‌లోని ఆయ‌న నివాసంలో చేనేత రంగంలో సేవ‌లందించిన వారిని స‌న్మానించారు. ఈ సంద‌ర్భంగా బండారు ద‌త్తాత్రేయ మాట్లాడుతూ… చేనేత రంగంలో సేవ‌లందించిన ప్ర‌ముఖుల‌ను సన్మానించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా వారి సేవలకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారి భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని దత్తాత్రేయ ఆకాంక్షించారు. అలాగే చేనేత కార్మికులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు విజయ లక్ష్మీ, మాజీ ఎమ్మెల్యే వన్నల శ్రీరాములు, సినీ ర‌చ‌యిత సుద్దాల అశోక్ తేజ, పద్మ శ్రీ చింతకింది మల్లేశం, గ‌జం గోవర్ధన్, గజం అంజయ్య, కందగట్ల నరసింహ, భోగ సరస్వతి తదితర ప్రముఖులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page