Friday, September 18, 2026
HomeNationalబండెనక బండి కట్టి – గులాబీల జెండ పట్టి – బీఆర్ఎస్...

బండెనక బండి కట్టి – గులాబీల జెండ పట్టి – బీఆర్ఎస్ రజతోత్సవ పాటను ఆవిష్కరించిన పార్టీ అధినేత కేసీఆర్

 

ఎర్ర‌వెల్లి, అద్దం న్యూస్ : ఈనెల‌ 27 న వరంగల్‌లో జరగనున్న బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ఆ పార్టీ అధినేత కెసిఆర్ యోచిస్తున్నారు. ఇందులో భాగంగా సందర్భంగా నాటి నుండి నేటి వరకు బీఆర్ఎస్ ప్రస్థానాన్ని పేర్కొంటూ రజతోత్సవం సందర్భంగా పాటలు, కళారూపాల్ని రూపొందించాలని పార్టీ అధినేత కేసీఆర్ రసమయికి సూచించారు. రచయిత, గాయకుడు, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ రచించి గానం చేసిన “బండెనక బండి కట్టి – గులాబీల జెండ పట్టి ” బీఆర్ఎస్ రజతోత్సవ పాటను పార్టీ అధినేత కేసీఆర్ గురువారం ఎర్రవెల్లి నివాసంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఇతర నాయకులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page