సంగారెడ్డి క్రైమ్, అద్దం న్యూస్ : సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో ముగ్గురు పిల్లలకు తల్లి విషం ఇచ్చి చంపిన కేసులో నిందితురాలు రజిత, ఆమె ప్రియుడు శివ లను గురువారం సంగారెడ్డి జైలుకు తరలించారు. గత మార్చి నెల 27వ తేదీన సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో జరిగిన ఈ ముగ్గురి చిన్నారుల హత్య సంచలనం సృష్టించింది. అమీన్‌పూర్‌లో చెన్నయ్య, తన భార్య రజిత (45), సాయికృష్ణ (12), మధు ప్రియ(10), గౌతమ్ (08)లతో కలిసి నివసిస్తున్నాడు. చెన్నయ్య వాటర్ ట్యాంక్ తీసుకొని కాలనీలో వాటర్ సప్లై చేస్తుంటాడు. ఇదిలా ఉండగా ఇటీవల 10వ తరగతి విద్యార్థుల గెట్ టు గెదర్ పార్టీలో తన టెన్త్ క్లాస్ స్నేహితుడు శివతో రజితకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ నేపధ్యంలో ప్రియుడితో కలిసి ఉండాలంటే ముగ్గురు పిల్లల అడ్డుతొలగించాలని పథకం వేసింది. మార్చి 27న తేదీన రాత్రి భోజనం చేసేటప్పుడు రజిత పెరుగులో విషపదార్థం కలిపింది. అయితే పెరుగు తినకుండా.. వాటర్ ట్యాంక్ తీసుకొని కాలనీలో వాటర్ సప్లైకి చెన్నయ్య వెళ్లిపోయాడు. భర్త వెళ్లిపోగానే ముగ్గురు పిల్లలకు విషం కలిపిన పెరుగన్నం పెట్టింది. అర్ధరాత్రి రెండు గంటలకు చెన్నయ్య ఇంటికి వచ్చేసరికి తమ ముగ్గురు పిల్లలు విగతజీవులుగా పడి ఉన్నారు. తట్టి చూడగా ఆ ముగ్గురు చనిపోయినట్టు గుర్తించాడు. అదే సమయంలో కడుపు నొప్పిగా ఉందని భార్య రజిత చెప్పడంతో ఆమెను చెన్నయ్య ఆస్పత్రిలో చేర్పించాడు. తొలుత పోలీసులు మొదట భర్త చెన్నయ్యపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులకు రజిత తీరు పై అనుమానం వచ్చింది. ఆమెను విచారించగా రజిత బాగోతం బయటపడింది. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారనే ముగ్గురు పిల్లలకు అన్నంలో విషం కలిపి చంపినట్టు రజిత ఒప్పుకుంది. దీంతో రజితను, ఆమె టెన్త్ క్లాస్ ప్రియుడు శివ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png














Leave a Reply