బండి సంజయ్‌ను కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి
– ఎమ్మెల్యే ముఠా గోపాల్
హైదరాబాద్, మే 11, ( అద్దం న్యూస్ ) : బండి సంజయ్‌ను కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌చేయాలని ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్ డిమాండ్ చేశారు. మైనర్ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్ చౌరస్తాలో కేంద్ర మంత్రి బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేసి రాస్తారోకో నిర్వహించారు. సందర్భంగా బండి సంజయ్ కి, ఆయన కుమారుడు భగీరథకు బిఆర్ఎస్ నేతలు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఆందోళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, ఫోక్సో చట్టం కింద కేసు నమోదు అయితే దానిని హనీ ట్రాప్ గా కేసు నమోదు చేసి నిర్వీర్యం చేశారని… ఇందుకు రాష్ట్రంలో బిజెపి కాంగ్రెస్ ఒక్కటే అని వస్తున్న ఆరోపణలు నిజమవుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో బిజెపి.. కాంగ్రెస్ ఒకటేనని, అందుకోసం కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ కేసును నిర్వీర్యం చేయడమే అందుకు నిదర్శనం అని అన్నారు.
బిఆర్ఎస్ రాష్ట్ర యువజన విభాగం నాయకుడు ముఠా జై సింహ మాట్లాడుతూ… బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌కు సంబంధించి ఫోక్సో కేసుకు బాధ్యత వహించి బండి సంజయ్ తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలి, అతను చేయకపోతే కేంద్ర ప్రభుత్వం బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ ను వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధిత బాలిక కుటుంబ సభ్యులకు న్యాయం జరిగేంతవరకు ప్రతి ఒక్కరూ పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ముషీరాబాద్ డివిజన్ మాజీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొండా శ్రీధర్‌రెడ్డి, ఆకుల అరుణ్‌కుమార్, మీడియా ఇన్‌చార్జ్ ముచ్చకుర్తి ప్రభాకర్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు తలారి శ్రీకాంత్ ముదిరాజ్, రోషం బాలు, గోక నవీన్, స్రవంతి, ఉమారాణి, మేరి, ముఠా నరేష్, జావీద్ ఖాన్, మహ్మద్ అలీ, దీన్ దయాల్‌రెడ్డి, రాకేష్, వల్లాల శ్రీనివాస్, రవి యాదవ్, ఎర్రం శ్రీనివాస్, దుర్గస్వామి, లక్ష్మీపతి, మేడి సత్యనారాయణ, హరీష్, ఇంధ్రసేనారెడ్డి, బొట్టు శ్రీనివాస్, మాధవ్ తదితరులు పాల్గొన్నారు.![]()


