ఎగ్గొట్టే వాళ్ల‌కే బ్యాంకులు రుణాల‌ను ఇస్తున్నాయి.. రైతుల‌కు మాత్రం ఇవ్వ‌రు – నాబార్డ్ 44వ ఫౌండేషన్ వేడుకల్లో పాల్గొని మంత్రి తుమ్మల వ్యాఖ్యలు

నాన్ అగ్రి క‌ల్చ‌ర్‌లో వేల కోట్ల రూపాయలు అప్పులు బ్యాంకులు ఇస్తున్నాయి

వారేమో లోన్లు చెల్లించరు కొందరు దేశాలు విడిచి వెళ్లిపోతారు

మా రైతులకు రుణాలు ఇవ్వాలంటే కారణాలు అడుగుతారు

మీ పాలసీలోనే ఏదైనా లోపం ఉందా ప్రశ్నించిన రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

– నాబార్డ్ 44వ ఫౌండేషన్ వేడుకల్లో పాల్గొని మంత్రి తుమ్మల వ్యాఖ్యలు



తెలంగాణ బ్యూరో, జులై 15, అద్దం న్యూస్ :   నాన్ అగ్రి క‌ల్చ‌ర్ వాళ్ల‌కే వేల కోట్ల రూపాయలు అప్పులు బ్యాంకులు ఇస్తున్నాయి వారేమో లోన్లు చెల్లించరు.. కొందరు దేశాలు విడిచి వెళ్లిపోతారని… మా రైతులు చిన్న రుణం అడిగితే పలు కారణాలు అడుగుతారు ఎందుకు అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయం చేసే మా రైతులకు ఎందుకు రుణాలు ఇవ్వరు అని ఘాటుగా ప్రశ్నించారు. మీ బ్యాంకుల పాలసీలోనే ఏదైనా లోపం ఉందా అని ప్రశ్నించారు. నాన్ అగ్రి కల్చర్ వాళ్లు ఎగ్గొట్టిన లోన్లు ఎన్ని… మా అగ్రి కల్చర్‌ రంగం వారు ఎగ్గొట్టిన లోన్లు ఎన్ని బేరీజు వేసుకోండి అని మంత్రి సూచించారు. నాబార్డ్ 44 వ ఫౌండేషన్ డే వేడుకలు హైద‌రాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని నాబార్డ్ తెలంగాణ రీజనల్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం జరిగాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నాబార్డ్ ప్రగతిని సూచిస్తూ రూపొందించిన ఆడియో పాటను, సావనీర్లను ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ… మా రైతుల పై పెట్టుబడి పెట్టండి దేశాన్ని బతికిస్తార‌ని… ప్రపంచంలోనే మన దేశాన్ని అగ్రభాగంలో నిలుపుతారని మంత్రి పేర్కొన్నారు. దానికి ఉదాహరణ నాబార్డ్, గ్రామీణ బ్యాంకులే అన్నారు. నాబార్డ్, గ్రామీణ బ్యాంకులు రుణాలు ఇచ్చి రైతాంగాన్ని ఆదుకుంటున్న తీరు అద్భ‌త‌మ‌న్నారు. ఆనాడు గ్రామీణ బ్యాంకు తనకు ఇచ్చిన రుణంతో వ్యవసాయం చేసి ఈనాడు ఈస్థితికి చేరుకున్నానని… తన పురోభివృద్దిలో గ్రామీణ బ్యాంకు రుణ సహకారం మరువలేనిదన్నారు. ఆంధ్రా ప్రాంతంలో వ్యవసాయంతో లక్షలు లక్షలు సంపాదిస్తున్నారన్నారు. ఎంతో అభివృద్ది చెందుతున్నారని బావించి మన తెలంగాణాలో కూడా ఎందుకు చేయకూడదనే ఉద్దేశంతో తమ ఊరి పక్క‌ గ్రామంలో పెట్టిన గ్రామీణ బ్యాంకులో నుంచి పుల్లయ్య అనే మేనేజర్ మొదటి సారి రుణం ఇవ్వడంతో పాటు రెండో సారి కూడా రుణం ఇచ్చారని గుర్తు చేశారు. మన కళ్ల ముందే మల్టీ నేషనల్ కంపెనీ వారు వేల కోట్లు లోన్ బ్యాంకుల నుంచి తీసుకుంటున్నారు.. ఎంసిబిఎల్ అంటున్నార‌న్నారు. దాన్నే మూడు వందలు, నాలుగు వందలకే బినామీ పేర్ల మీద వారే కొంటున్నారన్నారు. ఇవన్నీ చూస్తుంటే ఇలా మా రైతాంగం కూడా పెద్ద మొత్తంలో డబ్బులు లోన్ తీసుకుని ఎగ్గొటొచ్చా అని మాకు అనిపిస్తుంటుందన్నారు. అలా ఉంటే మాకు చెప్పండి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. భారతావనిని ప్రగతిపథంలో నడిపే వ్యవసాయరంగానికి రుణాలు ఇవ్వండి అని బ్యాంకులను కోరారు. ఈ సమావేశంలో టీజీసీఏబి ( తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అఫెక్ట్స్ బ్యాంక్ లిమిటెడ్ ) చైర్మన్ ఎం.రవీందర్‌రావు, సహకార శాఖ కమిషనర్ సురేంద్రమోహన్, నాన్ స్కాబ్‌ చైర్మన్ కె.రవీందర్, ఎస్‌బిఐ సీజీఎం రాధాకృష్ణన్, నాబార్డ్ సీజీఎం ఉదయ్‌ బాస్కర్, నాబార్డ్ జీఎం గణపతి, ఏజీఎం రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా పలువురికి మెమొంటోల‌తో అభినందించారు.

బిత్తరపోయిన ఎస్‌బిఐ సీజీఎం :

వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలతో పేజీపై ఉన్న ఎస్‌బిఐ సీజీఎం రాధాకృష్ణ‌న్ బిత్తరపోయారు. వేల కోట్ల రూపాయలు నాన్ అగ్రికల్చర్ వారికి లోన్లు ఇస్తున్నారని… కొందరేమో ఎగ్గొట్టి దేశాలకు వెళ్ళిపోతున్నారని… మా రైతాంగానికి మాత్రం రుణాలు ఇవ్వ‌రూ అంటూ మాట‌లు సభా ముఖంగా రాష్ట్ర మంత్రి నుంచి రావడంతో ఎస్‌బిఐ సీజీఎం రాధాకృష్ణన్ చిన్న‌బోయినట్టుగా కనిపించింది.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page