

హైదరాబాద్, అక్టోబర్ 21, అద్దం న్యూస్ : కాంగ్రెస్ పాలనలో బస్తీ దవాఖానాలకు సుస్తీ పట్టిందని ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ముషీరాబాద్ డివిజన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో గల బస్తీ దవాఖానాను మంగళవారం ఎమ్మెల్యే ముఠా గోపాల్ సందర్శించారు. ఈ సందర్భంగా బస్తీ దవాఖానాలో గల వైద్యులు, రోగులను కలిసి అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ… బస్తీ దవాఖానాలో సరైన మందులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. బస్తీ దవాఖానాలో పని చేస్తున్న వైద్యులతో పాటు వైద్య సిబ్బందికి జీతాలు రాకపోవడం వల్ల వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కేసీఆర్ కిట్ ఎందుకు రావడం లేదు, బస్తీ దవాఖానలో మందులు ఎందుకు లేవు, వాళ్లకి జీతాలు ఎందుకు వస్తలేవని ఒక్క నాడైన కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. కెసిఆర్ ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలు బాగున్నాయని ఆనాడు 15 వ ఆర్థిక సంఘం కేంద్రంలోని ప్రభుత్వమే ప్రశంసించిందని ఎమ్మెల్యే గోపాల్ గుర్తు చేశారు. బస్తీ ప్రజలకు ఇబ్బంది కలగవద్దు… తమ గడప దగ్గరనే, తమ వాకిట్లోనే వైద్యం అందించాలని ఉద్దేశ్యంతో దేశంలోనే మొట్ట మొదటి సారిగా బస్తీ దవాఖానలను బీఆర్ఎస్ హయాంలో అప్పటి సీఎం కెసిఆర్ ఈ బస్తీ దవాఖానాలను ప్రారంభించడం జరిగిందన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 450 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తే హైదరాబాదులో 350 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో 110 రకాల మందులు ఉచితంగా అందించే వాళ్ళమని, 130 రకాల పరీక్షలను ఉచితంగా చేసి పేషంట్ల ఫోన్లకే రిపోర్టులు పంపించే వాళ్ళమన్నారు. కానీ ఈ రోజు కాంగ్రెస్ పాలనలో బస్తీ దవాఖానాలకు సుస్తీ పట్టిందని ధ్వజమెత్తారు. ఆరు నెలల నుండి జీతాలు రావడం లేదని.. సపోర్టింగ్ స్టాఫ్ కు సైతం జీతాలు రావడంలేదని అక్కడి సిబ్బంది చెబుతున్నారన్నారు. బస్తీ దవాఖానలో పనిచేసే సిబ్బందికి ఆరు నెలల నుంచి జీతాలు రాకపోతే వారు పని ఎలా చేస్తారని ముఠా గోపాల్ ప్రశ్నించారు. కేవలం 60, 70 రకాల మందులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, 40 రకాల మందులు సప్లై లేదన్నారు.పేషెంట్లతో మాట్లాడితే కొన్ని మందులు ఇస్తున్నారు కొన్ని మందులు బయట కొనుక్కోవాలని చెప్తున్నారని అంటున్నారని ముఠా గోపాల్ తెలిపారు.టెస్టులలో బి12 d 3 టెస్టులకు రీ ఏజెంట్లు సప్లై లేకపోవడం వల్ల అన్ని రకాల టెస్టులు జరగడం లేదన్నారు. హాస్పిటల్లో కేసీఆర్ కిట్టు ఇవ్వకపోవడం వల్ల 20 శాతం డెలివరీలు ప్రైవేటు ఆసుపత్రికి బదిలీ అయ్యాయని, కేసీఆర్ మీద కోపంతో పథకాలను బంద్ చేస్తే పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నాయకుడు ముఠా జైసింహా, శ్రీధర్ గౌడ్, పులిగిల్ల శ్రీధర్ చారి, వల్లాల శ్యామ్ యాదవ్, భాషపాక శ్రీనివాస్, బలవంత్, దీన్ దయాల్రెడ్డి, బస్తీ దవాఖానా వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply