Saturday, September 19, 2026
No menu items!
HomeNationalబ‌త్తుల సిద్ధేశ్వ‌ర్‌ ఆమరణ నిరహార దీక్ష విరమణ – కుల గణన సాధించే...

బ‌త్తుల సిద్ధేశ్వ‌ర్‌ ఆమరణ నిరహార దీక్ష విరమణ – కుల గణన సాధించే వరకు పోరాడుతాం

📰 Generate e-Paper Clip

 

న్యూ ఢిల్లీ, అద్దం న్యూస్ :   దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని, తెలంగాణ బీసీ బిల్లును 9 వ షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్ చేస్తూ గత 22 రోజులుగా ఢిల్లీలో బీసీ ఆజాది ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న బత్తుల సిద్దేశ్వర్ ఆరోగ్యం క్షీణించింది, మంగ‌ళ‌వారం తెలంగాణ భవన్ వద్ద బీసీ అజాది ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ అధ్యక్షతన దీక్ష విరామ సదస్సు జరిగింది, దీక్షపరుడు బత్తుల సిద్దేశ్వర్ కు ఆమ్ ఆద్మీ పార్టీ పార్లమెంటరీ నేత సంజయ్ సింగ్, ఏఐసిసి ఓబీసీ సెల్ చైర్మన్ అనిల్ జైహింద్, బీపీ మండల్ మనవడు ప్రొఫెసర్ సూరజ్ మండల్, ఎంఎల్‌సి తీన్మార్ మల్లన్న, సుప్రీంకోర్టు న్యాయవాదులు డాక్టర్ కే.ఎస్ చౌహన్, ఎక్కా, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం జాతీయ అధ్యక్షుడు ఆళ్ల రామకృష్ణ, బీసీ ఆజాది ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు జక్కని సంజయ్ కుమార్ లు నిమ్మరసం తాగించి దీక్ష విరమింప చేశారు. ఈ సందర్భంగా సంజయ్ సింగ్ మాట్లాడుతూ… దేశ వ్యాప్తంగా కుల గణన చేయాలని గత 2018 నుంచి పోరాటం చేస్తున్నామని, 2018లో పార్లమెంట్‌లో రాజ్‌నాథ్‌సింగ్ 2021 జనాభా గణనలో కుల గణన చేస్తామని హామీ ఇచ్చారని… కానీ నేటికీ జన గణననే చేయలేదని ప్రభుత్వం వెంటనే జన గణన ప్రక్రియ చేపట్టాలని జన గణనలో కుల గణన చేయాలని డిమాండ్ చేశారు. ఏఐసిసి ఓబిసి సెల్ చైర్మన్ అనిల్ జైహింద్ యాదవ్ మాట్లాడుతూ… కుల గణనకు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలుపుతుందని ప్రభుత్వం కుల గణన విషయంలో వారి వైఖరిని స్పష్టం చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు, మహిళా బిల్లులో బీసీ కోటాను ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి బిసిలపై చిత్త శుద్ధి ఉంటే బీసీలకు బడ్జెట్ కేటాయింపులు చేయాలని డిమాండ్ చేశారు. బీపీ మండల్ మనువడు ప్రొఫెసర్ సూరజ్ మండల్ మాట్లాడుతూ… దేశ వ్యాప్తంగా బీసీల పోరాటాన్ని బలోపేతం చేస్తామని, మెమెంతో మాకంత వాటా కోసం దేశ వ్యాప్తంగా బీసీ ఆజాది పోరాటం చేస్తామని అన్నారు, ఈ పోరాటంతో బీసీల హక్కులను సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంఎల్‌సి తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ… తెలంగాణ బీసీ బిల్లును తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు, తెలంగాణ రాష్ట్రంలో బీసీల వాటాను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు చాపర్తి కుమార్ గాడ్గే, కొంగర నరహరి, బత్తుల రాంనర్సయ్య, చింతంకింది వెంకటస్వామి, విశ్వపతి, ఊరకొండ శివ, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page