Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadరాజ్యాంగ సవరణ ద్వారానే బీసీ రిజర్వేషన్లు సాధ్యం – మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

రాజ్యాంగ సవరణ ద్వారానే బీసీ రిజర్వేషన్లు సాధ్యం – మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

📰 Generate e-Paper Clip

రాజ్యాంగ సవరణ ద్వారానే బీసీ రిజర్వేషన్లు సాధ్యం
– మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

దద్దరిల్లిన నారాయణగూడ
భారీ ర్యాలీ.. రోడ్డుపై బైఠాయించిన నాయకులు, విద్యార్థులు
భారీ ట్రాఫిక్ జామ్

హైదరాబాద్, డిసెంబ‌ర్ 1, అద్దం న్యూస్ :     రాజ్యాంగ సవరణ ద్వారానే బీసీ రిజర్వేషన్లు సాధ్యం అవుతుంద‌ని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో ఫీజులు కడితేనే గ్రీస్ మార్కులు వేస్తామని కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులు వేదిస్తున్నారని, విద్యకు విద్యార్థులు దూరమవుతున్నర‌ని తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం అధ్య‌క్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో హైద‌రాబాద్ నారాయ‌ణ‌గూడ‌లో భారీ ర్యాలీ జ‌రిగింది. ఈ ర్యాలీకి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా విద్యార్థుల‌తో క‌లిసి రోడ్డుపై బైఠాయించి నిర‌స‌న‌ను తెలియ‌చేశారు. ఈ సంద‌ర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ… బిసిల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ల‌ను అమ‌లు చేయాలంటే తొమ్మిదో షెడ్యూల్డ్‌లో చేర్చాలన్నారు. జీఓ 9 ఉండ‌గా జిఓ 46 ను ప్ర‌వేశ‌పెట్టి బీసీల‌కు అన్యాయం చేశార‌న్నారు. ఫీజుల బకాలు చెల్లించకుండా విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో రిజర్వేషన్లు పెంచాకే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం మాట ఇచ్చిన మాట తప్పారని విమ‌ర్శించారు.

రాష్ట్ర ప్రభుత్వం రెండు సంవత్సరాలుగా 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని బీసీలను మోసం చేశారని ధ్వ‌జ‌మెత్తారు. జీవో 46 అమలు చేయడం తీవ్ర అన్యాయం స్థానిక సంస్థల ఎన్నికలు తక్షణమే రద్దు చేయాలని, తెలంగాణ రాష్ట్రంలో 12,735 గ్రామపంచాయతీలో కేవలం 2176 బీసీల రిజర్వేషన్లు కల్పించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రెండు సంవత్సరాలుగా 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని బీసీలను మోసం చేశారన్నారు. జీవో 46 అమలు చేయడం తీవ్ర అన్యాయం స్థానిక సంస్థల ఎన్నికలు తక్షణమే రద్దు చేయాలన్నారు. బీసీలపై ఏమాత్రం సిద్ధ శుద్ధి లేదని, కులగన లెక్కలు బయట పెట్టరన్నారు. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లరు… కేంద్ర నాయకులను కలవరు ఒత్తిడి పెట్టరని మండిప‌డ్డారు. ఇండియా కూటమికి ఎంపీలు ఉన్న ఎక్కడ పార్లమెంట్‌లో మాట్లాడరని దుయ్య‌బ‌ట్టారు. కాంగ్రెస్ చిత్తశుద్ధి ఉంటే రాబోయే పార్లమెంట్ సమావేశాలు స్థంభింప‌ చేయాల‌న్నారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందగోపాల్, మోహన్, వేణు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page