Sunday, September 20, 2026
No menu items!
HomeNational'వారి కోసం బీసీసీఐ మరిన్ని వన్డేలు నిర్వహించాలి'

‘వారి కోసం బీసీసీఐ మరిన్ని వన్డేలు నిర్వహించాలి’

📰 Generate e-Paper Clip

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: భారత సీనియర్ ప్లేయర్లు.. రోహిత్‌ శర్మ (Rohit Sharma), విరాట్‌ కోహ్లీ (Virat Kohli) ఏడాది పొడవునా ఆటలో కొనసాగడానికి, బీసీసీఐ (BCCI) మరిన్ని వన్డేలను షెడ్యూలు చేయాలని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్ (Irfan Pathan) సూచించాడు. భారత జట్టు 2026లో తన తొలి వన్డేను జనవరి 11న న్యూజిలాండ్‌తో ఆడనుంది. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ ఇప్పటికే.. టీ20, టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వారు కేవలం వన్డే క్రికెట్‌లోనే కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ అయిదు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లు, త్రైపాక్షిక సిరీస్‌లు ఎందుకు నిర్వహించడం లేదని ఇర్ఫాన్‌ పఠాన్‌ ప్రశ్నించాడు. 2027 వన్డే వరల్డ్‌కప్‌ వరకు రోహిత్‌, విరాట్‌కు తగినంత క్రికెట్‌ ఆడే అవకాశం కల్పించాలని సూచించాడు.

‘మనం మూడు వన్డేల సిరీస్‌ల బదులు అయిదు వన్డేల సిరీస్‌లు ఎందుకు ఆడకూడదు. ఎందుకు త్రైపాక్షిక సిరీస్‌లు నిర్వహించడం లేదు. మంచి విషయం ఏంటంటే.. ఇప్పటికీ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ అద్భుత ప్రదర్శనలు చేస్తున్నారు. వరల్డ్‌ కప్‌ నేపథ్యంలో వారికి తగినంత మ్యాచ్‌ ప్రాక్టీస్‌ కల్పించాలి. ఒకవేళ అంతర్జాతీయ మ్యాచ్‌లు లేకపోతే వారు దేశవాళీ క్రికెట్‌లోనైనా వరుసగా మ్యాచ్‌లు ఆడాలి’ అని ఇర్ఫాన్‌ పఠాన్‌ అన్నాడు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page