Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadస‌న్న బియ్యం కోసం ల‌బ్దిదారుల‌ను క్యూలైన్ల‌ల్లో నిల‌బ‌డ‌కుండా చూడాలి – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్...

స‌న్న బియ్యం కోసం ల‌బ్దిదారుల‌ను క్యూలైన్ల‌ల్లో నిల‌బ‌డ‌కుండా చూడాలి – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, జూన్ 6, అద్దం న్యూస్ :         స‌న్న బియ్యం అర్హులైన అంద‌రికి అందేలా తగిన చర్యలు చేపట్టాలని, క్యూలైన్లలో నిలబడకుండా తగిన చర్యలు తీసుకోవాలని టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు పిన్నమ‌నేని సాయిబాబా అన్నారు. శుక్ర‌వారం హైద‌రాబాద్ న‌గ‌ర టిడిపి కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ… ఇటీవల ప్రభుత్వం పౌర సరఫరా శాఖ ద్వారా ఇస్తున్న సన్న బియ్యం మూడు నెలలకు సంబంధించిన బియ్యం ఒకేసారి ఇవ్వాలని నిర్ణయించడంతో రేషన్ షాపుల వద్ద అధిక సంఖ్యలో చేరి ఎక్కడ బియ్యం అయిపోతాయని దిగులుతో ఉదయం ఆరు గంటల నుండే క్యూ లైనులలో నిలబడి వృద్ధులు మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. సన్నబియ్యం ఇవ్వాలనే ప్రభుత్వ ఉద్దేశ్యం స్వాగతించదగినదే అయినా కూడా వృద్దులు, మహిళలు గంటలు గంటలుగా నిలబడి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ పంపిణీ జరుగుతున్న తీరును ప్రభుత్వం పర్యవేక్షించి.. పర్యవేక్షణ చేపట్టి అందరికీ సన్న బియ్యం అందేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు నల్లెల్ల కిషోర్, పి.బాలరాజుగౌడ్, నాయ‌కుడు ఎస్.ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page