అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: కార్తి (Karthi) హీరోగా నలన్ కుమారాస్వామి తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ వా వాతియార్, తెలుగులో ఈ మూవీని అన్నగారు వస్తారు పేరుతో తీసుకొస్తున్న విషయం తెలిసిందే. కే.ఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై మద్రాస్ హైకోర్టు స్టే విధించడం టీమ్‌కు పెద్ద షాక్‌గా మారింది. నిర్మాత జ్ఞానవేల్ రాజాతో పాత ఆర్థిక లావా దేవీల వివాదం ఉందని ఫైనాన్షియర్ అర్జున్లాల్ సుందర్రాస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఈ నిర్ణయం వచ్చింది.
2014లో ఆయనకు స్టూడియో గ్రీన్ రూ.10.35 కోట్లు అప్పు తీసుకొని ఇప్పటికీ వడ్డీతో కలిపి రూ.21.78 కోట్లు బకాయిలు ఉన్నాయని ఆరోపించారు. బకాయిలు పూర్తిగా క్లియర్ చేసే వరకు మూవీ రిలీజ్ ఆపాలని అందులో కోరారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం స్టే విధించి ఈ నెల 8కి కేసును వాయిదా వేసింది. ఇక 8న జరిగే కోర్టు విచారణ మూవీ భవిష్యత్తును నిర్ణయించునుంది.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png














Leave a Reply