42 శాతం బిసి రిజ‌ర్వేష‌న్ల అంశంలో ఆట‌లాడుతున్న బిజెపి, కాంగ్రెస్ –  మాజీ చైర్మన్ జ‌స్టీస్ ఈశ్వ‌ర‌య్య‌

42 శాతం బిసి రిజ‌ర్వేష‌న్ల అంశంలో ఆట‌లాడుతున్న బిజెపి, కాంగ్రెస్
  మాజీ చైర్మన్ జ‌స్టీస్ ఈశ్వ‌ర‌య్య‌

బ‌షీర్‌బాగ్, డిసెంబ‌ర్ 20, అద్దం న్యూస్ :    బిసిల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ల అంశంలో బిజెపి, కాంగ్రెస్ పార్టీలు  ఆట‌లాడ‌తున్నాయ‌ని జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ మాజీ చైర్మన్ జ‌స్టీస్ ఈశ్వ‌ర‌య్య‌ పేర్కొన్నారు. పార్లమెంట్‌లో 9వ షెడ్యూల్ ద్వారా 42 శాతం రిజర్వేషన్ల సాధన, బీసీ సాధికారతపై అఖిల భారత బీసీ సమాఖ్య 42 శాతం రిజ‌ర్వేష‌న్స్ సాధ‌న స‌మితి ఆధ్వ‌ర్యంలో శ‌నివారం హైద‌రాబాద్ బ‌షీర్‌బాగ్ ప్రెస్‌క్ల‌బ్‌లో విలేక‌రుల స‌మావేశాన్ని నిర్వ‌హించింది. ఈ స‌మావేశానికి ముఖ్య అతిథిగా జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ మాజీ చైర్మన్ జ‌స్టీస్ ఈశ్వ‌ర‌య్య‌, ఏఐబిసిఎఫ్ జాతీయ అధ్య‌క్షుడు టి.చిరంజీవులు, ధ‌ర్మ స‌మాజ్ పార్టీ అధ్య‌క్షుడు డాక్ట‌ర్‌.విశార‌ద‌న్ మ‌హారాజ్‌, ఏఐబిసిఎఫ్ తెలంగాణ అధ్య‌క్షుడు, ప్రొఫెస‌ర్ డాక్ట‌ర్‌.విజ‌య్ భాస్క‌ర్‌, గంగాధ‌ర్‌, వేణు, శ్రీకాంత్‌, వెంక‌న్న త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఇటీవ‌ల జ‌రిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో విజేతలైన బిసి స‌ర్పంచ్‌ల‌కు అభినందనలు తెలియ‌చేశారు. ఈ సంద‌ర్భంగా ఈశ్వ‌ర‌య్య మాట్లాడుతూ…. ఓసీలు అన్ని రంగాలలో సామాజిక రాజకీయ ఆధిపత్యంతో ఉన్నార‌న్నారు. బిసీల‌కు 42 శాతం రిజర్వేషన్ల ఆట విఫలమవడానికి బిజెపి, కాంగ్రెస్ ఆడుతున్నాయ‌ని విమ‌ర్శించారు. అన్ని బిసిలు బలంగా, ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

             42 శాతం రిజర్వేషన్లను సాధించడానికి ప్రాథమిక హక్కులను తెలుసుకోవాల‌న్నారు. న్యాయవ్యవస్థలో అన్యాయం ప్రబలంగా ఉందని, ఎంబిసి ఛైర్మన్‌గా బిసిల సమస్యల గురించి తెలుసుకున్నానన్నారు. భార‌త్ జోడోయాత్రలో జాతి భావాలను జనాభాతో సమానంగా పంచుకోవాలని మేము రాహుల్‌ను అభ్యర్థించామ‌ని, కామారెడ్డిలో రాహుల్ రాజకీయ, విద్య, ఉపాధిలో 42 శాతం రిజర్వేషన్ల ప్రకారం ప్రకటించారని గుర్తు చేశారు. స్థానిక సంస్థల రిజర్వేషన్లు. బిసి సంఘాలు రిజర్వేషన్ల కోసం పోరాడాయ‌న్నారు. చిరంజీవులు మాట్లాడుతూ… 2018లో ఎఐబిసిఎఫ్ స్థాపించబడిందని, 42 శాతం రిజర్వేషన్లను 9 షెడ్యూల్‌లో చేర్చాలని, అది రాజ్యాంగ హక్కు అని అన్నారు. బిజెపిపై ఒత్తిడి పెరగాలని, రిజర్వేషన్లను 50 శాతం పరిమితికి మించి పెంచడానికి ఆర్డినెన్స్. వర్గీకరణ తప్పనిసరి అని అన్నారు. ఏఐబిసిఎఫ్‌, బిసిఐఎఫ్‌, బిసిపిఎఫ్‌, ఎస్సీ, ఎస్టీ, బిఇస జేఏసి బీసీ జనాభా కోసం ఏకాగ్రతతో పోరాడాల‌న్నారు.

 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page