కుట్రతోనే సర్ పేరుతో ఓట్లను తొలగిస్తున్న బిజెపి
అడ్డదారిలోనే కిషన్‌రెడ్డి గెలిచాడు
– రాజ్యసభ సభ్యుడు ఎం.అనిల్ కుమార్ యాదవ్
హైదరాబాద్, జూన్ 24, ( అద్దం న్యూస్ ) : కుట్రతోనే సర్ పేరుతో ఓట్లను బిజెపి కేంద్ర ప్రభుత్వం తొలగిస్తుందని రాజ్యసభ సభ్యుడు ఎం.అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్‌లో కూడా దొంగతనంగానే కిషన్‌రెడ్డి గెలిచాడని అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. బుధవారం హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ…. ఏ ఏ రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ చేపట్టారో ఆయా రాష్ట్రాల్లో బిజెపి అధికారంలోకి వచ్చిందన్నారు. భారత దేశంలో ఉన్నటువంటి అర్బన్ నియోజకవర్గంలో బిజెపి వ్యతిరేక ఓట్లను తొలగించి దొంగతనంగా గెలుస్తున్నారని విమర్శించారు. బిజెపి వాళ్లు ఒక ప్రణాళిక ప్రకారంగా వాళ్ల ఓటరా కాదా చూసుకొని బిజెపి వ్యతిరేక ఓట్లను తొలగిస్తున్నారన్నారు. టెక్నికల్ సాకులు చూపి వాళ్లకు అనుకూలంగా లేని ఓట్లను బిజెపి వాళ్లు తొలగిస్తున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్ నగరానికి చాలా రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారు ఉంటారన్నారు. 2002 ఎన్నికల సమయంలో తీసుకున్న ఓటరు లిస్టును తీసుకొని ఓటరు ఎన్‌రోల్ చేస్తున్నారన్నారు.
బూత్ లెవల్ ఆఫీసర్లు వస్తే వారికి సహకరించి.. ఓటరుగా ఎన్‌రోల్ చేసుకోవాలన్నారు. బస్తీల్లోని ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండి తమ తమ ఓటరును నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటు ఉంటేనే భారతదేశంలో బతికి ఉన్నట్టు అని, ఓటు ఉంటేనే ప్రభుత్వం పథకాలను పొందవచ్చన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో ప్రజల సౌకర్యార్థం కోసం సర్ లో నమోదు చేసుకునేందుకు, అవగాహన కల్పించేందుకు కాల్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేయనున్నామన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ల ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ సర్ పై ప్రజలకు అవగాహన చేస్తున్నారని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వాజిద్ హుస్సేన్, పాశం అనిల్ కుమార్ యాదవ్, బాకారం డివిజన్ అధ్యక్షుడు సంగపాక వెంకట్, బద్దం మోహన్‌రెడ్డి, కాదాసి నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు.













Leave a Reply