Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadభారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయడానికి బిజెపి కుట్రలు పన్నుతోంది – అదం సంతోష్ కుమార్

భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయడానికి బిజెపి కుట్రలు పన్నుతోంది – అదం సంతోష్ కుమార్

📰 Generate e-Paper Clip

 

సికింద్రాబాద్‌, ఏప్రిల్ 9, అద్దం న్యూస్  భారత రాజ్యాంగం, మహనీయుల ఔన్నత్యం గూర్చి ప్రజలకు అవగాహన కల్పించడం కోసం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఆదం సంతోష్ కుమార్ తెలిపారు. బుధవారం చౌద్ధ‌న‌గ‌ర్ డివిజ‌న్‌లో సికింద్రాబాద్ నియోజకవ‌ర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జ్ అదం సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తెలంగాణా రాష్ట్ర వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత హాజరయ్యారు. ఈ సందర్భంగా బాపూజీ, డాక్టర్ అంబేద్కర్, భారత రాజ్యాంగం చిత్రపటాలను చేతిలో పట్టుకొని ర్యాలీ నిర్వహించారు. ప్రజలకు మహనీయుల గురించి, రాజ్యాంగం గురించి వివరించి వాటి విలువలను తెలియజేసారు. అదం సంతోష్ మాట్లాడుతూ.. భారతదేశ రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ విలువల పై ప్రజల్లో అవగాహన పెంచడంమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగాన్ని బీజేపీ పార్టీ అ అణగదొక్కాలని చూస్తుందన్నారు. గాంధీ అంబెడ్కర్ ఆశయాలను సిద్ధాంతాలను దేశంలో అమలు చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. ప్రధానికి పేద ప్రజల కంటే బడా బాబులే ముఖ్యం అన్నారు. రాజ్యాంగం కేవలం ఒక పుస్తకం కాదు, అంబెడ్కర్, గాంధీ పూలే లాంటి గొప్ప వాళ్ళ ఆలోచనలతో కూడిన ఒక పవిత్ర గ్రంథం అన్నారు. ప్రజలకు ఏ సమస్య వచ్చిన నా దృష్టికి తీసుకొని రావాలన్నారు. యువకుల కోసం యువ వికాసం పథకం ద్వారా సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ కల్పిస్తున్నామన్నారు. BJP is conspiring to weaken the Indian Constitution – Adam Santosh Kumarకల్వ సుజాత మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ప్రభుత్వం, ఆరు గ్యారెంటీలను ఒక్కొకటి అమలుపరుస్తుందని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అప్పులను తప్పులను సరిదిద్దుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధిని చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు అనిల్ కుమార్, షకీల్, చక్రం, బబ్లూ, శ్రీకాత్, బాబు, మహేష్, కిరణ్, తుమ్మ రాజు, నాని, రాధ, గీతాంజలి, రజిత, కవిత, లడ్డు మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page