Saturday, September 19, 2026
No menu items!
HomeGREATER HYDERABADబ్లాక్ మెయిలర్ల సంఘం అధ్యక్షుడు రేవంత్ రెడ్డి – తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల...

బ్లాక్ మెయిలర్ల సంఘం అధ్యక్షుడు రేవంత్ రెడ్డి – తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

📰 Generate e-Paper Clip

బ్లాక్ మెయిలర్ల సంఘం అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఎందుకు ప్రశ్నించలేదు ?
🔹తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

తెలంగాణ బ్యూరో, సెప్టెంబ‌ర్ 12, ( అద్దం న్యూస్ ) :   బ్లాక్ మెయిలర్ల సంఘం అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆర్టీఐ చట్టాన్ని దుర్వినియోగం చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులను పెద్ద ఎత్తున బెదిరించిన వ్యక్తి మీరు కాదా ? అని ప్ర‌శ్నించారు. తెలంగాణలో బ్లాక్ మెయిలర్స్ సంఘం పెడితే దానికి మీరే అధ్యక్షులు అవుతారని ప్రజలందరికీ తెలుసు అని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో సస్పెండ్ చేస్తే…కౌన్సిల్ లో ఎందుకు ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఎందుకు ప్రశ్నించలేదు ? అని… కౌన్సిల్ లో మీరు వాకౌట్ ఎందుకు చేశారు ? అసలు మీ ఉద్దేశం ఏంటీ ? అని క‌విత బిఆర్ఎస్ పార్టీని ప్ర‌శ్నించారు. శ‌నివారం ఆమె మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిర పర్చేందుకు ఆంధ్రావాళ్లతో కలిసి క్యాష్ డీల్ చేసి దొరికిపోయింది మీరు కాదా ? అని, అలాంటి మీరు నేను స్వాతిముత్యాన్ని, సాంప్రదాయానిని, సుద్దపూసను అంటే ఎవరు నమ్మరని క‌విత దుయ్య‌బ‌ట్టారు. ముఖ్మమంత్రి అసెంబ్లీలో అబద్దాలు చెబుతుంటే అడ్డుకోవటానికి ప్రధాన ప్రతిపక్షం లేదన్నారు. గుంపు మేస్త్రీ – గుంటనక్క మధ్య కుమ్మక్కు లేకుంటే నేను ఆధారాలు ఇస్తా.. సిద్దిపేటలో వంద ఎకరాల భూ బదలాయింపుపై చర్యలు తీసుకోవాల‌ని, త‌నకు కమీషన్లు ఎందుకంటూ అసెంబ్లీలో కమల్ హాసన్ లెక్క ఏకపాత్రాభినయం చేస్తున్నడని ధ్వ‌జ‌మెత్తారు. సీఎం పాపాల చిట్టా బయటపెట్టేందుకు ఈ నెల 20 న కొడంగల్ వస్తున్నామ‌న్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చిస్తారనుకుంటే… అసెంబ్లీ ఆవరణలో అధికార, ప్రతిపక్షాలు బాహబాహీకి దిగి తిట్టుకున్నాయన్నారు. ఇది కాస్త స్పీకర్ ను దుర్భాలాడే వరకు వెళ్లడం మనం గమనించామ‌ని, ఈ సంఘటనలన్నీ చూస్తే మాజీ పార్లమెంటీరియన్ గా, మాజీ ఎమ్మెల్సీగా చాలా బాధగా ఉందన్నారు.

తన పాపాలు కడుక్కోవటానికి, తన క్యారెక్టర్ గొప్పదని చెప్పటానికి తనకు కమీషన్లు ఎందుకు అని ఆయన అంటున్నారని… తనకు భగవంతుడు అన్ని ఇచ్చారని అసెంబ్లీ సాక్షిగా చెబుతున్నారని, అవును ఈ రాష్ట్రాన్ని దోచుకునేందుకు ఆయనకు ఓ మిత్రమండలిని, భయంకరమైన ఫ్యామిలీని, బోలెడంత మంది అవినీతి మినిస్టర్లను ఆయనకు భగవంతుడు ఇచ్చాడన్నారు. 22ఏ పేరుతో పొంగులేటి, ఇరిగేషన్ ప్రాజెక్ట్ ల ద్వారా ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇసుక ద్వారా సీతక్క కమీషన్లు తెచ్చి ఇచ్చేలా వాళ్లకు రాసిచ్చారన్నారు. మీరు ఒక అవినీతి సామ్రాట్ గా ఉన్నారు. కానీ నాకెందుకు కమీషన్లు అంటూ మాట్లాడుతున్నారన్నారు. మూసీ నుంచి ఇసుక వరకు పిన్ టు పిన్ ఈ ముఖ్యమంత్రి అవినీతికి పాల్పడుతున్నాడని, ఆయనొక అవినీతి కింగ్, సామ్రాట్. ఆయన ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని ధ్వ‌జ‌మెత్తారు. ముఖ్యమంత్రి మీ పాపాల అవినీతి చిట్టాను కొడంగల్ లోనే బయట పెడతామ‌ని క‌విత స్ప‌ష్టం చేశారు. ఈ నెల 20 న పాంచజన్య సంకల్ప సభను ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే నిర్వహించి ఆయన అవినీతిని ప్రజల ముందు ఉంచుతామ‌న్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page