Friday, September 18, 2026
Homedevotionalబోనాల ఉత్స‌వాలను ప్ర‌శాంతంగా జ‌రుపుకోవాలి – సెంట్ర‌ల్ జోన్ డిసిపి శిల్ప‌వ‌ల్లి

బోనాల ఉత్స‌వాలను ప్ర‌శాంతంగా జ‌రుపుకోవాలి – సెంట్ర‌ల్ జోన్ డిసిపి శిల్ప‌వ‌ల్లి

బోనాల ఉత్స‌వాలను ప్ర‌శాంతంగా జ‌రుపుకోవాలి

– సెంట్ర‌ల్ జోన్ డిసిపి శిల్ప‌వ‌ల్లి



హైదరాబాద్, జులై 18, అద్దం న్యూస్ :    ఆషాడ బోనాలు, ఫ‌ల‌హారం బండ్ల ఊరేగింపు ఉత్స‌వాల‌ను ప్ర‌శాంతంగా జ‌రుపుకోవాల‌ని నిర్వాహ‌కుల‌కు సెంట్ర‌ల్ జోన్ డిసిపి శిల్ప‌వ‌ల్లి సూచించారు. బోనాల ఉత్స‌వాల సంద‌ర్భంగా శుక్ర‌వారం రాత్రి ముషీరాబాద్ చౌర‌స్తా వ‌ద్ద గ‌ల ఓ ఫంక్ష‌న్‌హాల్‌లో బోనాల ఫ‌ల‌హారం బండ్ల ఊరేగింపు నిర్వాహ‌కులు, ఆల‌యాల నిర్వాహ‌కుల‌తో స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశానికి ముఖ్య అతిథిగా సెంట్ర‌ల్ జోన్ డిసిపి శిల్ప‌వ‌ల్లి హాజ‌రై మాట్లాడుతూ… బోనాల పండుగ సంద‌ర్భంగా భ‌క్తి గీతాల‌ను, సాంప్ర‌దాయ‌బ‌ద్ధంగా జ‌రుపుకోవాల‌న్నారు. ఫ‌ల‌హారం బండ్ల ఊరేగింపుల్లో డిజె సౌండ్ సిస్ట‌మ్స్‌కు అనుమ‌తి లేద‌న్నారు. ఉత్సవాల నేపథ్యంలో చైన్ స్నాచర్స్, పిక్ పాకెటర్, సెల్‌ఫోన్ దొంగల పట్ల ప్రజలు అప్రమత్తత పాటించాలని సూచించారు. ఈ స‌మావేశంలో చిక్కడపల్లి ఏసీపీ రమేష్ కుమార్, ముషీరాబాద్ సిఐ రాంబాబు, చిక్కడపల్లి సిఐ రాజు నాయక్, ముషీరాబాద్ డిఐ న‌దీమ్ హుస్సేన్‌, ఎస్ఐలు, బోనాల ఉత్స‌వాల నిర్వాహ‌కులు త‌దిత‌రులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page