ప్ర‌ముఖ ర‌చ‌యిత్రి కెహెచ్ఎస్‌.జ‌గ‌దాంబ ర‌చించిన శ్రీ కాశీ విశ్వేశ్వ‌ర నామావ‌ళి పుస్త‌కావిష్క‌ర‌ణ‌

ప్ర‌ముఖ ర‌చ‌యిత్రి కెహెచ్ఎస్‌.జ‌గ‌దాంబ ర‌చించిన శ్రీ కాశీ విశ్వేశ్వ‌ర నామావ‌ళి పుస్త‌కావిష్క‌ర‌ణ‌


హైదరాబాద్, జులై 29, అద్దం న్యూస్ :   శ్రీ మాన‌స ఆర్ట్ థియేట‌ర్స్ ఆధ్వ‌ర్యంలో ప్ర‌ముఖ ర‌చ‌యిత్రి సంఘ‌మిత్ర కెహెచ్ఎస్‌.జ‌గ‌దాంబ ర‌చించిన శ్రీ కాశీ విశ్వేశ్వ‌ర నామావ‌ళి స‌హ‌స్రాధికం ( ప‌ద్య రూపం ) పుస్త‌కావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం మంగ‌ళ‌వారం హైద‌రాబాద్ విద్యాన‌గ‌ర్ రాంన‌గ‌ర్ గుండు వ‌ద్ద జ‌రిగింది. శ్రీ పింగ‌ళి వెంక‌య్య చారిట‌బుల్ ట్ర‌స్ట్ స‌మావేశ మందిరంలో అంత‌ర్జాతీయ విశిష్ట మ‌హిళ పుర‌స్కార గ్ర‌హీత ( తెలంగాణ ) పాఠ్య‌పుస్త‌క ర‌చ‌యిత్రి ల‌య‌న్ డాక్ట‌ర్‌.బండారు సుజాత రాజ‌శేఖ‌ర్ స‌భాధ్య‌క్ష‌త‌న జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగావిదుషీమ‌ణి డాక్ట‌ర్‌.అనంత‌ల‌క్ష్మీ లు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా వారు శ్రీ కాశీ విశ్వేశ్వ‌ర నామావ‌ళి స‌హ‌స్రాధికం ( ప‌ద్య రూపం ) పుస్త‌కాన్ని ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా విదుషీమ‌ణి డాక్ట‌ర్ అనంత‌ల‌క్ష్మీ ధ‌ర్మాన‌మాత్రం చేత‌, స్మ‌ర‌ణ‌మాత్రం చేత మ‌నల్ని క‌రుణించే దైవం శ్రీ కాశీ విశ్వేశ్వ‌రుడ‌ని, ఆయ‌న స‌హ‌స్ర‌నామావళి ఆధ్యాత్మిక‌వేత్త‌ల‌కు శ‌క్తిని, ముక్తిని ప్ర‌సాదిస్తాయ‌ని అన్నారు. ల‌యంకారంలో ప్ర‌కాశించే అద్భుత శ‌క్తి శ్రీ కాశీ విశ్వేశ్వ‌రుడ‌ని, ఆయ‌న‌ను ద‌ర్శ‌న‌మాత్రం చేత‌, స్మ‌ర‌ణ మాత్రం చేసే ప్ర‌స‌న్న చేసుకోగ‌ల‌మ‌న్నారు. క‌స్తూరి జ‌గ‌దాంబ ల‌య‌బ‌ద్దంగా, రాగ‌యుక్తంగా పాడుకొనే రీతిన కూడా విశ్వేశ్వ‌రుడ‌ని, స‌హ‌స్ర నామావ‌ళిని ర‌చించి అందించ‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు. స‌భాధ్య‌క్ష‌త‌న వ‌హించిన ల‌య‌న్ డాక్ట‌ర్‌.సుజాత రాజ‌శేఖ‌ర్ మాట్లాడుతూ… ఎన‌భై వ‌సంతాల వ‌య‌స్సులో కూడా జ‌గ‌దాంబ భ‌క్తితో, పార‌వ‌శ్యంతో అనుభూతిని పొంది కాశీ విశ్వేశ్వ‌ర స‌హ‌స్ర నామావ‌ళినందించడం గొప్ప విష‌య‌మ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో గౌర‌వాతిథిగా ప్ర‌ముఖ ర‌చ‌యిత్రి, పాత్రికేయులు ల‌య‌న్ డాక్ట‌ర్‌.పేకేటి గీతా శివ‌రాం, ఆత్మీయ అతిథిగా ఇండియ‌న్ లైఫ్ అండ‌ర్ రైట‌ర్ ప్ర‌ధాన సంపాద‌కులు, ఇన్సురెన్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ వృత్తి నిపుణులు సూరి సీతారాం, ప్ర‌ముఖ ప‌ద క‌వి క‌ళ్యాణ‌శ్రీ, క‌న్వీన‌ర్ కె.శ్యామ‌ల‌రావు, మాన‌స ఆర్ట్ థియేట‌ర్స్ అధ్య‌క్షుడు బండారుప‌ల్లి రామ‌చంద్ర‌రావు, మాన‌స ఆర్ట్ థియేట‌ర్స్ ఉపాధ్య‌క్షురాలు డాక్ట‌ర్‌.ల‌లితావాణి, వ్య‌వ‌స్థాప‌క కార్య‌ద‌ర్శి ర‌ఘుశ్రీ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ర‌చ‌యిత్రి జ‌గ‌దాంబ‌ను ఘ‌నంగా స‌త్క‌రించారు. శ్రీ మాన‌స ఆర్ట్ థియేట‌ర్స్ కార్య‌ద‌ర్శి ర‌ఘుశ్రీ స‌భా స‌మ‌న్వ‌యం చేశారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page