Saturday, September 19, 2026
No menu items!
HomeGREATER HYDERABADరంగు రంగుల దారపు పోగుల వెనుక అంతులేని రక్షణ, బాధ్యత, నమ్మకం దాగి ఉంది

రంగు రంగుల దారపు పోగుల వెనుక అంతులేని రక్షణ, బాధ్యత, నమ్మకం దాగి ఉంది

📰 Generate e-Paper Clip

రంగు రంగుల దారపు పోగుల వెనుక అంతులేని రక్షణ, బాధ్యత, నమ్మకం దాగి ఉంది
– మాజీ గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ

హైద‌రాబాద్‌, ఆగ‌స్టు 28, ( అద్దం న్యూస్ ) :   రంగు రంగుల దారపు పోగుల వెనుక అంతులేని రక్షణ, బాధ్యత, నమ్మకం దాగి ఉంటాయని మాజీ గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ అన్నారు. మహిళా నాయకులు, కార్యకర్తలు, బ్రహ్మకుమారీలు, జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులతో హైదరాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం రాంనగర్‌లోని తన నివాసంలో రక్షాబంధన్ వేడుకల్లో బండారు దత్తాత్రేయ మాజీ గవర్నర్ హాజ‌ర‌య్యారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ… రక్షాబంధన్ పండుగ సోదర–సోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయత, పరస్పర రక్షణకు ప్రతీక అన్నారు. మహిళా నాయకులు, కార్యకర్తలు, బ్రహ్మకుమారీలు, పారిశుద్ధ్య కార్మికులతో కలిసి రక్షాబంధన్ వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని, ప్రతి ఒక్కరి జీవితంలో సుఖసంతోషాలు, శాంతి, ఆరోగ్యం నెలకొనాలని బండారు దత్తాత్రేయ ఆకాంక్షించారు.

అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల మధ్య ఉన్న ప్రేమానురాగాలకు ప్రతీక ఈ రాఖీ పండుగ అని అన్నారు. ఒక చెల్లెలు తన అన్న చేతికి రాఖీ కట్టడం అంటే కేవలం ప్రేమను పంచడం మాత్రమే కాదు… కష్టసుఖాలలో ఒకరికి ఒకరు తోడుంటామనే భరోసాను పరస్పరం ఇచ్చుకోవడమే అని అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, హైదరాబాద్ నగర మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌ మాజీ మేయర్ బండారు కార్తిక రెడ్డి, బిజెపి మహిళా మోర్చా సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షురాలు కేతినేని సరళ, మాజీ కార్పొరేటర్ ఉమా రమేష్ యాదవ్, బిజెపి జాతీయ నాయకురాలు అరుణ జ్యోతి, మంత్రి కళావతి, భైరి అమరావతి, శోభా, శ్రీమతి మాధవి, జ్యోతి మహిళా మోర్చా నాయకులు, కార్యకర్తలు, బ్రహ్మకుమారీలు, జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page