వివేక్‌నగర్ ఆంజనేయస్వామి దేవాలయం
హుండీ లెక్కింపు
చిక్కడపల్లి, ఆగస్టు 24, ( అద్దం న్యూస్ ) : హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ చిక్కడపల్లి వివేక్‌నగర్ శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం హుండీ లెక్కింపు కార్యక్రమం సోమవారం జరిగింది. ఆలయ ఈవో కొమ్మాలు, లక్ష్మీగణపతి దేవాలయం ఈవో సాంబశివరావు, ఆలయ రెనోవేషన్ కమిటీ చైర్మన్ జానకి సుధాకర్ ల పర్యవేక్షణలో జరిగింది. 64 రోజులకుగాను హుండీని లెక్కించారు. ఇందులో భాగంగా ఆలయ ప్రధాన హుండీలో 2 లక్షల 51 వేల 515 రూపాయలు రాగా, ఈ-హుండీ లో 20 వేల 635 రూపాయలు వచ్చాయి. రెండు హుండీలకుగాను 2 లక్షల 72 వేల 150 రూపాయల ఆదాయం వచ్చినట్టు ఆలయ ఈవో కొమ్మాలు, ఆలయ రెనోవేషన్ కమిటీ చైర్మన్ జానకి సుధాకర్ లు తెలిపారు. ఈ ఆలయ హుండీ లెక్కింపులో ఆలయ రెనోవేషన్ కమిటీ సభ్యులు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.













Leave a Reply