చంద్రబాబు నాయుడి పై బిఆర్ఎస్ నాయ‌కుడు జ‌గ‌దీష్ రెడ్డి వ్యాఖ్య‌లు చేయ‌డం త‌గ‌దు – తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా

హైద‌రాబాద్‌, మే 31, అద్దం న్యూస్ :             టిడిపి జాతీయ అధ్య‌క్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి పై బిఆర్ఎస్ నాయ‌కుడు జ‌గ‌దీష్ రెడ్డి అవాక్కులు, చ‌వాక్కులు మాట్లాడుతున్నార‌ని, బూట‌క‌పు మాట‌లు క‌ట్టిపెట్టి ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాడాల‌ని తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా అన్నారు. శ‌నివారం హైద‌రాబాద్ న‌గ‌ర టిడిపి కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో సాయిబాబా మాట్లాడుతూ… బిఆర్ఎస్ నాయకులు మళ్లీ అధికారంలోకి వస్తామన్నా భ్రమలో ఉన్నారని, పగటి కలలు కనడం మాని వాస్తవ పరిస్థితుల్లోకి రావాలని అన్నారు. ఇతరుల ఇళ్లలోకి తొంగి చూసే ముందు తన ఇల్లు కాలిపోకుండా చూసుకోవాలని, కవిత విషయంలో ముందు తమ ఇల్లు సరిదిద్దుకోవాలని సాయిబాబా అన్నారు. బిఆర్ఎస్ అమ్ముడుపోతున్న పార్టీ అని, డబ్బులు ఇస్తే బిఆర్ఎస్ నాయకులు దేనికైనా సిద్ధపడతారని స్వయంగా మీ పార్టీ అధినేత కుమారే చెబుతోందిని, నీ పార్టీ నాయకురాలే మీరు అమ్ముడుపోతున్నారని చెపుతుంటే, ఆ అంశాన్ని పక్కదారి పట్టించడానికి ఇతరులపై రాళ్లు వేయడం మంచిది కాదని, ముందు మీ పార్టీని సరిదిద్దుకోవాలని హితవు పలికారు. తెలుగుదేశం హయంలో ఆరోజు చంద్రబాబు నాయుడు చేపట్టిన సంస్కరణ వల్ల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వల్ల ఈరోజు హైదరాబాద్ నగరం విశ్వనగరంగా విరాజిల్లుతుందని అన్నారు. బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటిపడి హైదరాబాద్‌ ప్రతిష్టను ఏవిధంగా దిగజార్చాలో అని ప్రయత్నిస్తున్నారని అన్నారు. దేశంలో ఉన్న రాష్ట్రాల నగరాల వస్తున్న ఆదాయం విషయంలో ( ముంబాయి- 36.3 శాతం, బెంగుళూరు 40.91 శాతం, చెన్నై 31.59 శాతం, హైదరాబాద్ 50.41 శాతంగా హైదరాబాద్‌ నగరం మొదటి స్థానంలో ఉందని, ఇదంతా చంద్రబాబు నాయుడు కృషి, ముందుచూపు వాళ్ళనే సాధ్యమైందని జగమెరిగిన నిజం అని అన్నారు. ఇంకోక సారి చంద్రబాబు నాయుడి పై గాని, తెలుగుదేశం పార్టీపై గాని అవాక్కులు.. చవాక్కులు మాట్లాడితే ఖబర్దార్ అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు నల్లెల్ల కిషోర్, పి.బాలరాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page