Monday, September 21, 2026
No menu items!
HomeTelanganaకౌన్సిల్ ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల వినూత్న నిరసన

కౌన్సిల్ ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల వినూత్న నిరసన

📰 Generate e-Paper Clip

తెలంగాణ బ్యూరో, అద్దం న్యూస్ :  మిర్చి రైతుల సమస్యలు పరిష్కరించాలని, 25 వేల గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సోమవారం శాసనమండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వినూత్న నిరసన చేశారు. మిర్చి దండలు వేసుకుని నిరసన ను తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో గత సీజన్‌లో 4 లక్షల ఎకరాల్లో సాగైన మిర్చి, ఈ సీజన్‌లో ధరల కారణంగా 2.4 లక్షల ఎకరాలకు తగ్గిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. మిర్చి రైతుల సమస్యలు పరిష్కరించి, రూ. 25,000 గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాఫెడ్, మార్క్‌ఫెడ్ ద్వారా మిర్చికి రూ. 25,000 మద్దతు ధర నిర్ణయించి ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు.


మిర్చి పంటను విదేశాలకు ఎగుమతి చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. మిర్చిని సుగంధ ద్రవ్యాల బోర్డు నుంచి ఆహార పంటల జాబితాలో చేర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు వాణిదేవి, మధుసూదన చారి తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page