Saturday, September 19, 2026
No menu items!
HomeGREATER HYDERABADఆదర్శవంతమైన తెలంగాణను నిర్మించడమే జ‌య‌శంక‌ర్‌కు అందించే నిజమైన నివాళి

ఆదర్శవంతమైన తెలంగాణను నిర్మించడమే జ‌య‌శంక‌ర్‌కు అందించే నిజమైన నివాళి

📰 Generate e-Paper Clip

ఆదర్శవంతమైన తెలంగాణను నిర్మించడమే జ‌య‌శంక‌ర్‌కు అందించే నిజమైన నివాళి
– తెలంగాణ అడ్వ‌కేట్ జేఏసి క‌న్వీన‌ర్‌ పులిగారి గోవ‌ర్థ‌న్‌రెడ్డి

ముషీరాబాద్‌, ఆగ‌స్టు 6, ( అద్దం న్యూస్ ) :   ఆశయాలను సాధిస్తూ, ఆదర్శవంతమైన తెలంగాణను నిర్మించడమే జ‌య‌శంక‌ర్‌కు అందించే నిజమైన నివాళి అని తెలంగాణ అడ్వ‌కేట్ జేఏసి క‌న్వీన‌ర్, తెలంగాణ ఉద్య‌మ‌కారుడు పులిగారి గోవ‌ర్థ‌న్‌రెడ్డి అన్నారు. తెలంగాణ జాతిపిత జ‌య‌శంక‌ర్ సార్ జ‌యంతి కార్య‌క్ర‌మం హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ అశోక్‌న‌గ‌ర్ ప్ర‌ధాన రోడ్డు మార్గంలో జ‌రిగింది. గురువారం జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో తెలంగాణ అడ్వ‌కేట్ జేఏసి క‌న్వీన‌ర్, తెలంగాణ ఉద్య‌మ‌కారుడు పులిగారి గోవ‌ర్థ‌న్‌రెడ్డి హాజ‌రై జ‌య‌శంక‌ర్ సార్ విగ్ర‌హానికి పూల‌మాల‌లేసి నివాళుల‌ర్పించారు. 1952 నాటి ముల్కీ ఉద్యమం నుంచి మరణించే వరకు ఆయన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరగని పోరాటం చేశారన్నారు. ” తెలంగాణ ప్రాంతం ఎందుకు ప్రత్యేక రాష్ట్రం కావాలి ? ” అనే దానిపై ఆయన పదేళ్లు విస్తృతమైన పరిశోధన చేసి, స్పష్టమైన ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక కారణాలను అందరికీ అర్థమయ్యేలా వివరించారని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమానికి ఒక బౌద్ధిక పునాదిని ( Intellectual Foundation ) వేశారన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ ఉద్యమానికి ఒక దిశా నిర్దేశం చేశారని తెలిపారు. జీవితాంతం అవివాహితిగా ఉంటూ, తన సర్వస్వాన్ని తెలంగాణ ప్రజల కోసమే అంకితం చేశారని, పదవులు, అధికారాల వెనుక ఎప్పుడూ పరుగులు పెట్టలేదన్నారు. పల్లెపల్లె తిరుగుతూ, విద్యార్థులను, యువతను, మేధావులను చైతన్యవంతం చేశారన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page