Saturday, September 19, 2026
No menu items!
HomeCrime Newsరజక కులస్థుల పై దాడి చేసిన కులతత్వ దురహంకారులను కఠినంగా శిక్షించాలి – తెలంగాణ ఉద్యమకారుల...

రజక కులస్థుల పై దాడి చేసిన కులతత్వ దురహంకారులను కఠినంగా శిక్షించాలి – తెలంగాణ ఉద్యమకారుల జేఏసి రాష్ట్ర అధ్య‌క్షుడు తుమ్మ‌ల ప్ర‌ఫుల్ రాంరెడ్డి

📰 Generate e-Paper Clip

రజక కులస్థుల పై దాడి చేసిన కులతత్వ దురహంకారులను కఠినంగా శిక్షించాలి
» తెలంగాణ ఉద్యమకారుల జేఏసి రాష్ట్ర అధ్య‌క్షుడు తుమ్మ‌ల ప్ర‌ఫుల్ రాంరెడ్డి

హైదరాబాద్, ఫిబ్రవరి 23, అద్దం న్యూస్ :   రజక కులస్థుల పై దాడి చేసిన కులతత్వ దురహంకారులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ ఉద్యమకారుల జేఏసి రాష్ట్ర అధ్య‌క్షుడు తుమ్మ‌ల ప్ర‌ఫుల్ రాంరెడ్డి డిమాండ్ చేశారు. సోమ‌వారం హైద‌రాబాద్ చిక్క‌డ‌ప‌ల్లిలోని జేఏసి రాష్ట్ర కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో తుమ్మ‌ల ప్ర‌ఫుల్ రాంరెడ్డి మాట్లాడుతూ… నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో నాలుగు రోజుల క్రితం టికెట్ లేకుండా గుడిలోకి ప్రవేశించారనే సాకుతో రజక ( చాకలి ) కులస్థులు అయిన గణేష్, చంద్రకళ, మౌనికల పై గ్రామ సర్పంచ్ తుకారాం రెడ్డి నాయకత్వంలో సతీష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మధు రెడ్డి త‌దిత‌రులు అగ్రకుల దురహంకారంతో భయంకరంగా దాడి చేసి కొట్టారన్నారు. రెండు నెలల పసిపాపను కాలుతో తొక్కి చంపారన్నారు. ఈ క్రూరమైన దాడిని మా తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ( టియు జేఏసి ) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. హంతకుల పై మర్డర్ కేసు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట ప్రభుత్వం బాధితులకు అండగా నిలిచి తగు రక్షణను, నష్టపరిహారాన్ని అందించాల్సిందిగా, హంతకులను శిక్షించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిందిగా, దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేవారు.

    రాష్ట్రంలో రోజూ ఏదో ఒక చోట దళిత బహుజనులపై అగ్రకులాల దాడులు, హత్యలు జరుగుతున్నాయన్నారు. గ్రామాలలో, బస్తీలో కుల వివక్షత అమలు జరుగుతుందన్నారు. కుల దురహంకారం, కులతత్వ నీచ సంస్కృతి పధకం ప్రకారం పెంచి పోషించబడుతుందన్నారు. అందువల్ల దాడులు పెరుగుతున్నాయని తెలిపారు. ఈ దాడుల‌ను అరికట్టడానికి తక్షణమే దళిత బహుజన ప్రజాస్వామిక శక్తులతో రాష్ట్ర ప్రభుత్వం చర్చించి తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. దాడులకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలతో పాటు వారి ఆస్తులను జప్తు చేసి బాధితులకు పంచడానికి అవసరమైన ప్రత్యేక చట్టం తీసుకురావాల‌న్నారు. ఈ సమావేశంలో టియు జేఏసి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి క‌ల్లెపు చంద్ర‌శేఖ‌ర్ ప్ర‌సాద్, మోహన్ బైరాగి, పిడమర్తి లింగయ్య, యాదగిరి, ఈట్టే ప్రభాకర్, మల్లేష్. ఎన్.సాగర్, రవి పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page