గ్రూప్ వన్ పరీక్ష అవకతవకలపై సిబిఐ విచారణ జరిపించాలి – బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు ఆర్.కృష్ణయ్య

 

హైదరాబాద్, అద్దం న్యూస్ :   గ్రూప్ వన్ పరీక్ష ఫలితాలలో అనేక అవకతవకలు జరిగాయని, మూల్యాంకనంలో తప్పులు చేశారని… పరీక్షా కేంద్రాలలో కేటాయింపులు అవకతవకలు జరిగాయని దీనిపై సిబిఐ విచారణ జరపాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీలా వెంకటేష్ జనార్దన్ ఆధ్వర్యంలో గ్రూప్ వన్ అభ్యర్థులు జనార్ధన్ అధ్య‌క్ష‌త‌న హైద‌రాబాద్‌ ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు మద్దతుగా ఎంపీ ఆర్.కృష్ణయ్య హాజరై మాట్లాడుతూ… గ్రూప్ వన్ ప్రశ్నా పత్రాల లీకేజీ ఎమ్మార్వో షీట్ల లోపాలు బయోమెట్రిక్ హాజరు లేకపోవడం వంటి అంశాలపై బాధ్యులైన అధికారులపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రూప్ వన్ పరీక్షలు ప్రక్క ప్రక్కనే కూర్చున్న అభ్యర్థులకు 30 మంది అభ్యర్థులకు దాదాపు సమాన మార్కులు రావడం అనేక మంది ఉండటం సెలక్షన్ అయిన వాళ్లలో చాలా మంది పక్కపక్కన హాల్ టికెట్ కలిగి ఉండడం అనుమానాలకు దారితీస్తుందని అన్నారు. ఇలా అనేక అవకతవకలు జరిగినట్టు స్పష్టంగా కనిపిస్తుందన్నారు. గ్రూప్ వన్ పరీక్షలు తిరిగి నిర్వహించాలని… పారదర్శకంగా విధివిధానాలను పున సమీక్షించి పూర్తి బయోమెట్రిక్ సీసీ కెమెరా పర్యవేక్షణలో పారదర్శకంగా పరీక్ష నిర్వహించాలన్నారు. బాధిత అభ్యర్థులకు నష్టపరిహారం ఇవ్వాలన్నారు. ఏకంగా రెండు పరీక్షలు రద్దు కావడం వల్ల వేల మంది అభ్యర్థులు మానసికంగా ఆర్థికంగా నష్టపోయార‌ని.. వారికి తగిన నష్టపరిహారం ఇవ్వాలన్నారు. న్యాయ విచారణకు హైకోర్టు లేదా రిటైర్డ్ జడ్జినేత్రీత్వంలో విచారణ కమిషన్ ఏర్పాటు చేసి పూర్తి పారదర్శకతమైన ఒక స్వతంత్ర విచారణ కమిటీ ద్వారా పరిశీలన జరపాలని అవకతవకలకు బాధ్యులైన అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం, లింగ ముదిరాజ్, పగిలి సతీష్, మోడీ రాందేవ్, ఏక సింగ్, రత్నాకర్ తదితర నాయకులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page