హైదరాబాద్, మే 4, అద్దం న్యూస్ : హైదరాబాద్ సికింద్రాబాద్ మెట్టుగూడ శ్రీ ఉమా మహేశ్వర సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం శతాబ్ది ఉత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డి, టిటియుసి రాష్ట్ర అధ్యక్షులు మోతే శోభన్ రెడ్డి లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వారు ప్రత్యేక పూజ కార్యక్రమాలలో పాల్గొనడంతో పాటు శ్రీ కాలభైరవ స్వామి ప్రణా ప్రతిష్ట, శ్రీ ఆంజనేయ స్వామి, నవగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమాలకు కూడా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శతాబ్ది ఉత్సవాలకు హాజరైనందుకు డిప్యూటీ మేయర్ ఆనందం వ్యక్తం చేశారు. దేవాలయం అభివృద్ధికి సహకారం అందించేందుకు తమ తరపున పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply