Saturday, September 19, 2026
No menu items!
HomeGREATER HYDERABADహైదరాబాద్‌ను ప్రపంచ ఐటీ పటంలో నిలబెట్టిన ఘనత చంద్రబాబు నాయుడిదే

హైదరాబాద్‌ను ప్రపంచ ఐటీ పటంలో నిలబెట్టిన ఘనత చంద్రబాబు నాయుడిదే

📰 Generate e-Paper Clip

హైదరాబాద్‌ను ప్రపంచ ఐటీ పటంలో నిలబెట్టిన ఘనత చంద్రబాబు నాయుడిదే
– టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎం.అరవింద్ కుమార్ గౌడ్

హైదరాబాద్, ఏప్రిల్ 20, అద్దం న్యూస్ :    హైటెక్ సిటీ స్థాపన ద్వారా హైదరాబాద్‌ను ప్రపంచ ఐటీ పటంలో నిలబెట్టిన ఘనత చంద్రబాబు నాయుడికే దక్కుతుందని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎం.అరవింద్ కుమార్ గౌడ్ అన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ సారథి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి 76వ జ‌న్మ‌దిన వేడుక‌లు తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు నల్లెల్ల కిషోర్, పి.బాలరాజ్ గౌడ్ ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌తో పాటు, దోమ‌ల‌గూడ‌లోని టిడిపి జిల్లా కార్యాల‌యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నాయ‌కులు న‌ల్లెల్ల కిషోర్‌, పి.బాల్‌రాజ్‌గౌడ్ ల ఆధ్వ‌ర్యంలో జిల్లా కార్యాల‌యంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎం.అరవింద్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా విచ్చేసి కేక్ కట్ చేసారు. అనంతరం ఆయ‌న‌ మాట్లాడుతూ… చంద్రబాబు నాయుడు కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదని, ఒక గొప్ప దార్శనికుడని ( Visionary ) కొనియాడారు. నేడు తెలంగాణ రాష్ట్రం ఐటీ రంగంలో సాధిస్తున్న పురోగతికి ఆయనే పునాది వేశారని వారు గుర్తు చేశారు.

సంక్షేమం – అభివృద్ధి జోడు గుర్రాలంటూ ఆడబిడ్డల కోసం దీపం రైతులకు అండగా జన్మభూమి, యువతకు ఉపాధి కల్పన వంటి విప్లవాత్మక పథకాలతో పాలనలో కొత్త ఒరవడి సృష్టించారని ప్రశంసించారు. ప్రస్తుతం 76 ఏళ్ల వయస్సులో కూడా 20 ఏళ్ల యువకుడిలా శ్రమిస్తూ, భారత దేశం ప్రపంచ అగ్రగామిగా ఎదగాలని ఆయన ప్రతిపాదించిన విజన్ 2047 డాక్యుమెంట్ ఆయన నిరంతర అభివృద్ధి కాంక్షకు నిదర్శనమని పేర్కొన్నారు. టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నాయ‌కులు న‌ల్లెల్ల కిషోర్‌, పి.బాల్‌రాజ్‌గౌడ్ లు మాట్లాడుతూ… చంద్రబాబు నాయకత్వంలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తోందని, నిబద్ధత కలిగిన కార్యకర్తలే పార్టీకి బలమని ఈ సందర్భంగా నేతలు నల్లెల్ల కిషోర్, పి.బాలరాజ్ గౌడ్ ఉద్ఘాటించారు. చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో వ‌ర్థిల్లాల‌ని, దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారికి ఆయన దిశానిర్దేశం మరిన్ని దశాబ్దాల పాటు అందాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామ‌ని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి న‌గ‌ర నాయ‌కులు ఎం.శ్యాంసుందర్, కరణం కిరణ్, భాను ప్రకాష్, ఎస్.ప్రకాష్, జగదీష్ గౌడ్, నాయుడు, చంద్రమోహన్ గౌడ్, బి.రాజు, ఆనంద్, సత్తన్న, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page