రాబోయే ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో టిడిపి పోటీ చేస్తుంద‌ని చంద్ర‌బాబు ప్ర‌క‌ట‌న హ‌ర్ష‌ణీయం – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

హైదరాబాద్, జూన్ 16, అద్దం న్యూస్ :    రాబోయే ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో టిడిపి పోటీ చేస్తుంద‌ని చంద్ర‌బాబు ప్ర‌క‌ట‌న హ‌ర్ష‌ణీయమ‌ని టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు పి.సాయిబాబా అన్నారు. సోమ‌వారం హైద‌రాబాద్ న‌గ‌ర టిడిపి కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో సాయిబాబా మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణలో పార్టీ తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుందని ప్రకటించడం పట్ల టిడిపి కార్య‌క‌ర్త‌లు చాలా సంతోషంగా ఉన్నార‌న్నారు. వాస్తవంగా తెలంగాణలోనే తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయి నుండి బలంగా ఉందని అన్నారు. గత10 సంవత్సరాలు పాలించిన టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల కంటే కంటే కూడా తెలుగుదేశం పార్టీకే బూత్ స్థాయి నుంచి కార్యకర్తల బలం అధికంగా ఉందన్నారు. చంద్రబాబు నిర్ణయాన్ని స్వాగతిస్తూ…. మేము రాబోయే ఎన్నికల్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ కూటమితో కలిసి పోటీ చేస్తే ఫలితాలు బాగుంటాయని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ పార్లమెంట్‌ పరిధిలో ఉన్న 39 డివిజన్‌లో 35 డివిజన్లకు డివిజన్ కమిటీలను పూర్తిస్థాయిలో వేసుకుని పార్టీ పటిష్ట పరుచుకునే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశామ‌న్నారు. ఈ కమిటీలన్న పూర్తిగా ప్రతిష్టపరుచుకొని ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండేటట్టు పార్టీని పటిష్టం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సాయిబాబా అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు నల్లెల్ల కిషోర్, బాలరాజ్ గౌడ్, నాయ‌కులు ఎస్‌.ప్ర‌కాష్‌ తదితరులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page