టిడిపి నగర నాయకుడు బాల్‌రాజ్‌గౌడ్
ఆధ్వర్యంలో
చంద్రబాబు బర్త్ డే వేడుకలు
ముషీరాబాద్, ఏప్రిల్ 20, అద్దం న్యూస్ : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడి జన్మదిన వేడుకలు హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం చిక్కడపల్లిలో ఘనంగా జరిగాయి. తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నాయకుడు, మాజీ కార్పొరేటర్ పలుస బాల్‌రాజ్‌గౌడ్ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు ఆరోగ్యంగా ఉండాలని సోమవారం చిక్కడపల్లిలోని శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో ప్రజలకు సేవ చేయాలని కోరారు. అనంతరం పేదలకు, జిహెచ్ఎంసి కార్మికులకు ఉచితంగా పులిహోర ప్యాకెట్లను బాల్‌రాజ్ గౌడ్ అందచేశారు. ఈ సందర్భంగా బాల్‌రాజ్ గౌడ్ మాట్లాడుతూ… హైదరాబాద్‌ను ప్రపంచపటంలో పెట్టిన రాజకీయ కోవిదుడు చంద్రబాబు అని అన్నారు. ఆనాడు ఎన్‌టి రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారన్నారు. ఎన్‌టిఆర్ అడుగుజాడల్లోనే చంద్రబాబు కూడా నిరంతరం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు డి.చంద్రమోహన్ గౌడ్, ఉదయ్ కుమార్ గుప్త, పి.శివకృష్ణ, జి.శంకర్, ఎం.పుల్లయ్య, గోపాల్, యాదగిరి, ఎస్‌వి.నాయుడు, అన్నపూర్ణ, వీణాదేవి తదితరులు పాల్గొన్నారు.![]()

![]()













Leave a Reply