చర్చల కళ్లెపు చంద్రన్నకు ఘనంగా నివాళి
నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడ్డ చంద్రన్న
– తెలంగాణ ఉద్యమకారుల జేఏసి ( టియుజేఏసి ) రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 12, అద్దం న్యూస్ : విప్లవకారులు జరిపిన చర్చల్లో జనశక్తి పార్టీ తరుపున 2004 లో ప్రభుత్వంతో చర్చల ప్రతినిధిగా హాజరైన కళ్ళెపు చంద్రన్న 6 వ వర్ధంతి కార్యక్రమం హైదరాబాద్ గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద జరిగింది. శుక్రవారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమకారుల జేఏసి ( టియుజేఏసి ) రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి, జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ బైరాగి, తెలంగాణ సినిమా వేదిక రాష్ట్ర అధ్యక్షులు లారా, టియు జేఏసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లపు చంద్రన్న తనయుడు, కల్లెపు ప్రసాద్, టియుకెవి రాష్ట్ర అధ్యక్షుడు వేముల యాదగిరి, టియుజేఏసి మహిళా వేదిక కన్వీనర్ బాకారం లావణ్య, మల్లూరి అనిల్ కుమార్, టియుపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, భారతీయ మౌన జాతుల సమితి అధ్యక్షుడు రామచంద్రం తదితరులు హాజరై నివాళులర్పించారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల జేఏసి ( టియుజేఏసి ) రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి మాట్లాడుతూ… 2004 లో కాంగ్రెస్ ప్రభుత్వం విప్లకారులతో చర్చలు నిర్వహించిందని, జనశక్తి పార్టీ తరపున పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం నూతన ప్రజాస్వామిక విప్లవ రాజ్యం కోసం తన వంతు పాత్రను వహిస్తూ చర్చలకు నాయకత్వం వహించిన చర్చల చంద్రన్నగా పేరు పొందిన కళ్లెపు చంద్రన్న అని అన్నారు. 1964 నుండి చనిపోయేవరకు దోపిడీ పీడన అణిచివేత, కుల వ్యవస్థలేని నూతన సమాజ నిర్మాణం కోసం చంద్రన్న పనిచేశారని అన్నారు. బతుకంతా ప్రజల కోసమే బతికాడని, రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం, అంతకు ముందు చంద్రబాబు ప్రభుత్వం విప్లవకారులను నిరాయుదులుగా పట్టుకొని హత్యలు చేస్తున్న కాలం అది అని అన్నారు. అలాంటి రోజుల్లో నమ్మిన సిద్ధాంతం కోసం చంద్రన్న నిలబడ్డారని, విప్లవకారులు నూతన రాజ్య స్థాపన కోసం ఎన్‌కౌంటర్లు అవుతున్న సమయంలో కూడా బెదిరిపోకుండా.. భయపడకుండా.. ధైర్యంగా ప్రజల్లో ఉంటూ పని చేశారని కొనియాడారు. కళ్లెపు చంద్రన్న ఆశయ సాధన కోసం నేటి తరం పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాము, హరి, గోశికె రవి, ధనలక్ష్మి, ఉగిరాల సుజి, మల్లేష్, రాజేష్, సాగర్, మాధవి లత, తదితరులు పాల్గొన్నారు.













Leave a Reply