...

తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ కార్యవర్గ సభ్యుడిగా చేపూరి వెంకటేశ్వరరావు నియామ‌కం

సికింద్రాబాద్, జూన్ 2, అద్దం న్యూస్ : తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ కార్యవర్గ సభ్యుడిగా సికింద్రాబాద్‌కు చెందిన చేపూరి వెంకటేశ్వరరావు నియమితులయ్యారు. ఈ మేరకు మున్నూరు కాపు మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి శ్రీనివాసరావు ఆదివారం కాచిగూడలోని మున్నూరు కాపు భవన్‌లో జరిగిన కార్యక్రమంలో నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా చేపూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ… తన సేవలను గుర్తించి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నియమించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ పదవి ఇవ్వడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని మున్నూరు కాపు కులస్తుల అభివృద్ధి, ఐక్యతకు పాటుపడతానన్నారు. అన్ని వర్గాలతో పాటుగా  కాపులు కూడా సమగ్ర అభివృద్ధి చెందాలన్నదే తన లక్ష్యమని… అందుకోసం తన వంతు కృషి చేస్తానన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.