భద్రాద్రి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

తెలంగాణ బ్యూరో, అద్దం న్యూస్ : భక్తుల కొంగుబంగారం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం అర్చకులు, అధికారులు ఆహ్వానించారు. ఈ మేర‌కు ఆదివారం మంత్రి కొండా సురేఖ, భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం అర్చకులు, అధికారులు జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రిని క‌లిసి ఈ మేరకు ఆహ్వాన పత్రిక అందించారు. సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కకు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు కూడా ఆహ్వానం అందించారు. భద్రాద్రి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డిప్యూటీ సీఎం, మంత్రులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో భద్రాచలం రాములవారి ఆలయ అభివృద్ధికి సంబంధించి అవసరమైన భూసేకరణ, ఇతర వివరాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన భూసేకరణ, నిధులకు సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్, భద్రాచలం ఆలయ ఈవో రమాదేవి, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page