మొబైల్ ఫోన్లను రికవరీ చేసిన చిక్కడపల్లి పోలీసులు
– బాధితులకు అందజేత
హైదరాబాద్, ఆగస్టు 5, ( అద్దం న్యూస్ ) : హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోని చిక్కడ్‌పల్లి పోలీసులు కేంద్ర ప్రభుత్వానికి చెందిన సిఇఐఆర్ ( Central Equipment Identity Register – CEIR ) పోర్టల్, ఆధునిక సాంకేతిక దర్యాప్తు సహాయంతో పోయిన, చోరీకి గురైన 25 మొబైల్ ఫోన్లను విజయవంతంగా రికవరీ చేశారు. చిక్కడపల్లి ఏసీపీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రికవరీ చేసిన మొబైల్ ఫోన్లను వాటి బాధితులకు అందజేశారు. చిక్కడపల్లి డివిజన్ ఏసీపీ జి.రణవీర్ రెడ్డి, చిక్కడపల్లి ఇన్‌స్పెక్టర్ ఎల్.మధు బాబు ల దిశానిర్దేశంలో ఈ రికవరీ చేశారు. ఈ సందర్భంగా చిక్కడపల్లి ఏసీపీ జి.రణవీర్ రెడ్డి మాట్లాడుతూ… ఎవరిదైనా మొబైల్ ఫోన్ పోయినా లేదా దొంగతనానికి గురైనా వెంటనే సమీపంలోని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని, లేదా CEIR పోర్టల్ ( www.ceir.gov.in ) లో వివరాలను నమోదు చేయాలని సూచించారు. సెల్ ఫోన్ పోయిన తక్షణమే వివరాలు నమోదు చేయడం వల్ల ఫోన్ పని చేయకుండా బ్లాక్ చేయవచ్చని, దుర్వినియోగాన్ని అరికట్టడంతో పాటు పోలీసులు త్వరగా గుర్తించి రికవరీ చేసేందుకు వీలు కలుగుతుందని తెలిపారు. సిఇఐఆర్ పోర్టల్ ద్వారా నిరంతరం సాంకేతిక విశ్లేషణ చేస్తూ, వివిధ ప్రాంతాల నుండి ఈ ఫోన్లను గుర్తించి రికవరీ చేసిన చిక్కడపల్లి సబ్ ఇన్‌స్పెక్టర్ మహమ్మద్ కరీమ్, క్రైమ్ టీమ్ సిబ్బంది, పీసీలు ఆంజనేయులు, డి.శివ, మహమ్మద్ ఇమ్రోజ్ లను ఏసిపి అభినందించారు.













Leave a Reply