Saturday, September 19, 2026
No menu items!
HomeNationalకోహ్లీని మించిన ఆటగాడు లేడు: కైఫ్

కోహ్లీని మించిన ఆటగాడు లేడు: కైఫ్

📰 Generate e-Paper Clip

కోహ్లీని మించిన ఆటగాడు లేడు: కైఫ్

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: టీమ్ ఇండియా గ్రేట్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. కోహ్లీ కేవలం ‘సులువైన ఫార్మాట్’ (వన్డేలు) ఎంచుకున్నాడన్న మంజ్రేకర్ వ్యాఖ్యలపై మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ తీవ్రంగా మండిపడ్డారు. ఒక చర్చా కార్యక్రమంలో సంజయ్ మంజ్రేకర్ మాట్లాడుతూ.. కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలకడాన్ని తప్పుబట్టారు. “జో రూట్, స్మిత్ వంటి వారు టెస్టుల్లో రాణిస్తుంటే, కోహ్లీ తన లోపాలను సరిదిద్దుకోలేక టెస్టుల నుంచి తప్పుకున్నాడు.” “టాపార్డర్ బ్యాటర్లకు ఎంతో సులువైన వన్డే ఫార్మాట్‌ను ఎంచుకోవడం నాకు నచ్చలేదు. వన్డేల్లో కొనసాగే బదులు అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అయితే బాగుండేది” అంటూ చులకనగా మాట్లాడారు.

‘వాడిది మూర్ఖత్వం’.. కైఫ్ ఘాటు సమాధానం

ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో కైఫ్ ఈ వ్యాఖ్యలను తిప్పికొట్టారు. “ప్రపంచంలో విరాట్ కోహ్లీకి దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. అన్ని ఫార్మాట్లలో ఆయనే నంబర్ 1.” టెస్టుల్లో రికార్డులే నిదర్శనమన్నారు. “కష్టతరమైన టెస్ట్ ఫార్మాట్‌లో 9,000 పైగా పరుగులు, 30 సెంచరీలు సాధించిన ఆటగాడిని.. సులువైన ఫార్మాట్ కోసం టెస్టులు వదిలేశాడనడం మూర్ఖత్వమే. అసలు క్రికెట్‌లో ఏ ఫార్మాట్ కూడా సులువు కాదు.” అని మండిపడ్డాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో కోహ్లీ 93 పరుగులు చేసినా, అభిమానులు సెంచరీ రాలేదని బాధపడటంపై కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఒక పిల్లాడు కోహ్లీ సెంచరీ చేయకపోతే వారం రోజులు అన్నం తినను అని ప్లకార్డ్ పట్టుకున్నాడు. 93 పరుగులు చేసినా సెంచరీ రాలేదని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారంటే.. విరాట్ కోహ్లీ తన ఆటతో నెలకొల్పిన ప్రమాణాలు (Standards) అటువంటివి.” అని తెలిపారు. మంజ్రేకర్ వ్యాఖ్యలపై విరాట్ సోదరుడు వికాస్ కోహ్లీ కూడా స్పందించారు. మంజ్రేకర్ పేరు ఎత్తకుండా.. “కోహ్లీ పేరు వాడకపోతే కొందరికి పూట గడవదు” అంటూ సోషల్ మీడియా వేదికగా చురకలు అంటించారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page