హైదరాబాద్, జూన్ 7, అద్దం న్యూస్ : పిల్లలు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ పావని వినయ్ కుమార్ అన్నారు. గాంధీనగర్ డివిజన్ అశోక్‌నగర్ కల్చరల్ వెల్ఫేర్ అసోసియేషన్ కమ్యూనిటీహాల్లో శనివారం ట్రెడిషనల్ చైనీస్ కున్ఫూ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ( షోలిన్ కున్ఫు ) నూతన శిక్షణ కేంద్రాన్ని ముఖ్య అతిథిగా గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ హాజరై ప్రారంభించారు. చైనా, కేరళలలో కున్ఫు, కరాటే, మార్షల్ ఆర్ట్స్ లో బ్లాక్ బెల్ట్ పొంది గొప్ప ప్రావీణ్యం పొందిన ఎం.వేంకటేశ్వర రావు ( గ్రాండ్ మాస్టర్) ఆధ్వర్యంలో ఈ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ పావని మాట్లాడుతూ… మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందడం ద్వారా పిల్లలు, యువత, శరిర దారుఢ్యంతో పాటు ఆత్మ రక్షణకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, సీనియర్ నాయకులు శ్రీకాంత్, విఎస్టి రాజు, విజయ్ నాథ్, విష్ణు ప్రసాద్, సురేష్ రాజు, అశోక్‌నగర్ కల్చరల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సూర్యప్రకాష్, సభ్యులు విజ్జి, రాజు తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply