తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి – తెలుగు దేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం అధ్యక్షులు పి.సాయిబాబా

హైదరాబాద్ బ్యూరో, అద్దం న్యూస్ : తెలంగాణ ప్రజలు తిరుపతికి వెళ్లడం, అందుకోసం తిరుపతి లెటర్ల కోసం పాకులాడటం ఏంటని జనాలను ఉద్దేశించి రాజ్యాంగ పదవిలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం నిజంగా విడ్డూరంగా ఉందని తెలుగు దేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం అధ్యక్షులు పి.సాయిబాబా అన్నారు. తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగర టిడిపి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాజ్యాంగ పదవిలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అందరి పట్ల అన్ని వర్గాల పట్ల వివక్ష లేకుండా గౌరవంగా ఉండాల్సిన వ్యక్తి.. అందరి అభిప్రాయాలను గౌరవించాల్సిన స్థాయిలో ఉండి వ్యక్తి అని అన్నారు. తెలంగాణలో గుడులు లేవా అని అనడం సమంజసం కాదని అన్నారు. యాదగిరిగుట్టకు వెళ్ళండి.. భద్రాచలం వెళ్లండి.. అంటూ చెప్పడం చాలా దురదృష్టకరమన్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాట్లాడాల్సిన మాటలు కావని, బాధ్యతాయుతమైన పదవిలో ఉండి బాధ్యతారహితంగా మాట్లాడటం ఈ ముఖ్యమంత్రికే చెల్లిందని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ఆయన మాట్లాడిన పొరపాటును సరిదిద్దుకొని ప్రజల పట్ల, ప్రజల మనోభావాల పట్ల గౌరవంగా మెలగాల్సిన అవసరం ఉందని అన్నారు.

ప్రజల అభిప్రాయాలను గౌరవించలేని స్థితిలో ఉన్న మీరు ముఖ్యమంత్రిగా ఉండి లాభమేమిటని అన్నారు. ప్రజలు ఏ గుడికైనా వెళ్తారు… ఎక్కడికి వెళ్ళినా మీరేమైనా డబ్బులు ఇస్తున్నారా అని ప్రశ్నించారు. హజ్ యాత్రకు డబ్బులు ఇచ్చినట్టు తెలంగాణ ప్రజలకు గుడుల దర్శనానికి డబ్బులు ఇవ్వట్లేదు కదా అని మండిపడ్డారు. ప్రజలు వారి సొంత ఖర్చులతో వారే వెళ్తున్నారు.. కాబట్టి ప్రజల తరఫున ముఖ్యమంత్రి మా అప్పీలు ఏమిటంటే ఆయన సొంత ఖర్చులతో వెళ్లే ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని అన్నారు.

తెలంగాణలో ఉన్న యాదగిరిగుట్ట నరసింహస్వామి వేరు… తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి వేరు అని మాట్లాడడం క్షమార్హం కాదన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరారు. జరిగిన పొరపాటుకు తెలంగాణా ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తారు. ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం ప్రధాన కార్యదర్శులు నల్లెల్ల కిషోర్, బాలరాజ్ గౌడ్, నాయకులు ఎస్.ప్రకాష్, తడక వినోద్, సుదర్శన్ రెడ్డి, బాను ప్రకాష్, శ్యామ్ సుందర్, కిరణ్, సత్యనారాయణ, సుక్రవేది తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page