Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadచలిపులి పంజా.. 8 జిల్లాల్లో సింగిల్ డిజిట్‌కు ఉష్ణోగ్రతలు

చలిపులి పంజా.. 8 జిల్లాల్లో సింగిల్ డిజిట్‌కు ఉష్ణోగ్రతలు

📰 Generate e-Paper Clip

చలిపులి పంజా.. 8 జిల్లాల్లో సింగిల్ డిజిట్‌కు ఉష్ణోగ్రతలు

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: తెలంగాణను తీవ్రమైన చలిగాలులు వణికిస్తున్నాయి. పగటిపూట ఎండ తక్కువగా ఉండటం, రాత్రిపూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదు కావడంతో తెలంగాణ ప్రజలు గజగజలాడుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోగా.. సుమారు 25 జిల్లాల్లో 14 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. మంగళవారం సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో అత్యల్పంగా 5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. రంగారెడ్డి జిల్లా రెడ్డిపల్లెలో 6.9 డిగ్రీలు నమోదు కాగా.. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో కూడా చలి తీవ్రత విపరీతంగా పెరిగింది.

భారత వాతావరణ శాఖ (IMD) తెలంగాణలోని ఏడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మెదక్, కామారెడ్డి, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి జిల్లాల్లో డిసెంబర్ 26 వరకు ఉష్ణోగ్రతలు 5 నుంచి 10 డిగ్రీల మధ్య ఉండే అవకాశం ఉందని హెచ్చరించింది. మరోవైపు హైదరాబాద్, హనుమకొండ, కరీంనగర్ సహా 15 జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. రాజధాని హైదరాబాద్‌లో రానున్న 24 గంటల్లో కనిష్ఠ ఉష్ణోగ్రత 13 డిగ్రీలుగా ఉండొచ్చని, ఉదయం వేళ దట్టమైన పొగమంచు కారణంగా విజిబిలిటీ తగ్గి వాహనదారులకు ఇబ్బందులు తప్పవని అధికారులు తెలిపారు.

పలు జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 5 డిగ్రీలకు పడిపోవడంతో, భారత వాతావరణ శాఖ ఏడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. రానున్న ఐదు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉన్నందున, వెచ్చని దుస్తులు ధరించడం మరియు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరమని చెబుతున్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page