చిన్నారుల ప్రాణాలను కాపాడడానికి ముందుకు రావడం అభినందనీయం
– శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఐవిఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్త
శేరిలింగంపల్లి, జులై 5, అద్దం న్యూస్ : చిన్నారుల ప్రాణాలను కాపాడడానికి ముందుకు రావడం అభినందనీయమని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఐవిఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్త లు అన్నారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్) 12వ వార్షికోత్సవం సందర్భంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు పబ్బ మల్లేశం గుప్త ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఐవిఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్త లు మాట్లాడుతూ… తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం రక్తదానం చేసిన రక్తదాతలు అన్నదాతలతో సమానమేనమేనని అన్నారు. ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన రక్తదాతలకు ప్రశంస పత్రాలను అందచేశారు. తలసేమియా వ్యాధి చిన్నారులకు ప్రతి 15 రోజులకు ఒక యూనిట్ రక్తం అవసరం ఉంటుందని ఆ చిన్నారుల ప్రాణాలను కాపాడడానికి ఐవీఎఫ్ నిరంతరాయంగా రక్తదాన శిబిరాలను డాక్టర్ బాలు ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐవిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పబ్బ చంద్రశేఖర్, ఐవిఎఫ్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కట్ట రవికుమార్, దారా లక్ష్మణ్ గుప్త, కెఎస్.సంపత్ కుమార్ గుప్త, జయకృష్ణ గుప్త, బడంపేట్ వెంకటేష్ గుప్త, వనమా శ్రీనివాస్ గుప్త, పబ్బ శ్రీనివాస్ గుప్త, ఐత భాస్కర్ గుప్త, చిన్నం సత్యనారాయణ గుప్త, కోటేశ్వర రావు, పృధ్వీ గుప్త, కెవి.గుప్త. జయకిశోర్ గుప్త, నటరాజు గుప్త, గాయత్రీ, లలిత తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply