Friday, September 18, 2026
HomeHyderabadఆదాయ మార్గాల కోసం ప్రజల్ని పీడించుకు తింటున్న కాంగ్రెస్ ప్ర‌భుత్వం – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్...

ఆదాయ మార్గాల కోసం ప్రజల్ని పీడించుకు తింటున్న కాంగ్రెస్ ప్ర‌భుత్వం – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

ఆదాయ మార్గాల కోసం ప్రజల్ని పీడించుకు తింటున్న కాంగ్రెస్ ప్ర‌భుత్వం

– టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా 

స‌మావేశంలో మాట్లాడుతున్న టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా
                          స‌మావేశంలో మాట్లాడుతున్న టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

హైద‌రాబాద్‌, మే 19, అద్దం న్యూస్ :   ఆదాయ మార్గాల కోసం ప్రజల్ని కాంగ్రెస్ ప్ర‌భుత్వం పీడించుకు తింటుంద‌ని టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా అన్నారు. సోమ‌వారం దోమ‌ల‌గూడ‌లోని న‌గ‌ర టిడిపి కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన స‌మావేశంలో సాయిబాబా మాట్లాడుతూ… ఏప్రిల్ నుండి మద్యం ధరలు విపరీతంగా పెంచి ప్రజల ఉసురుతీస్తోందని, దానికి తోడు ఇప్పుడు మెట్రో రైలు చార్జీలను కూడా పెంచిందన్నారు. బెంగళూరు, చెన్నై, ముంబాయి, ఢిల్లీ వంటి మహా నగరాలలో కూడా హైదరాబాద్‌ మెట్రోతో పోల్చుకుంటే చార్జీలో చాలా తక్కువగా ఉన్నాయని అన్నారు. హైదరాబాద్ మెట్రోరైలు ప్రజలకు ఒక శాపంగా మారిందని అన్నారు.  ప్రజా రవాణా సౌకర్యాలు చౌకగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఒక మంచి  ప్రణాళికతో మెట్రోరైలును రూపొందిస్తే, ఇప్పుడు రేట్లు పెంచి మెట్రో రైలు వ్యవస్థనే దెబ్బతీస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బు సంపాదించుకోవడానికి మెట్రో రైలును వాడుకుంటుందని అన్నారు. మెట్రో ధరలు మెట్రో రైలు ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. మెట్రో రైలులో సౌకర్యాలు, పరిశుభ్రత పారిశుద్ధ్యం పైన ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని అన్నారు. మ‌ద్యానికి బానిసైన కొందరు దొరికిందేదో తాగి గుడంబా, ఛీప్ లిక్కర్, నాటు సారా మొదలైన వాటికి అలవాటు పడి ఆరోగ్యం పాడయి కొన్ని కుటుంబాలకు కుటుంబాలే నాశనం అవుతుయ‌న్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం ఆరు ఏడు లక్షల కోట్ల అప్పు చేసిందని ఒకపక్క చెప్తూ మరోపక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం చేసిందన్నారు.

హైదరాబాద్ జిల్లా మాజీ అధ్యక్షుడు డాక్ట‌ర్‌.బి.ప్రతాప్ రెడ్డి మరణం పట్ల సంతాపం :

టిడిపి హైదరాబాద్ జిల్లా మాజీ అధ్యక్షుడు డాక్ట‌ర్‌.బి.ప్రతాప్ రెడ్డి మరణం పార్టీకి తీరని లోటని సాయిబాబా అన్నారు. ఆయన 2002 నుండి 2004 వరకు అధ్యక్ష భాధ్యతలు నిర్వహించారన్నారు. 1989లో ఎంపిగా పోటీ చేసి స్వల్పతేడాతో ఓడిపోయారన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు నల్లెల కిషోర్, పి.బాలరాజు గౌడ్, నాయ‌కులు ఎస్.ప్రకాష్, కృష్ణస్వామి తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page