Saturday, September 19, 2026
No menu items!
HomeGREATER HYDERABADప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు కేంద్ర బిందువుగా కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యాలు

ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు కేంద్ర బిందువుగా కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యాలు

📰 Generate e-Paper Clip

ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు కేంద్ర బిందువుగా కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యాలు
» యూత్ కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అర‌వింద్ కుమార్ యాద‌వ్‌

హైద‌రాబాద్‌, ఆగ‌స్టు 17, ( అద్దం న్యూస్ ) :   ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు కేంద్ర బిందువుగా కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యాలు ఉన్నాయ‌ని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర‌ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎం.అర‌వింద్ కుమార్ యాద‌వ్ అన్నారు. సికింద్రాబాద్ కాంగ్రెస్ క‌మిటీ కార్య‌ద‌ర్శి మారిశెట్టి న‌ర్సింగ్‌రావు ( బాబ్జీ ) ఆధ్వ‌ర్యంలో ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ జ‌వ‌హ‌ర్ స్కూల్ ప‌క్క వీధిలో నూత‌నంగా ఏర్పాటు చేసిన‌ కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యం సోమ‌వారం ప్రారంభ‌మైంది.

ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా యూత్ కాంగ్రెస్ రాష్ట్ర‌ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అర‌వింద్ కుమార్ యాద‌వ్ హాజ‌రై పార్టీ కార్యాల‌యాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… ప్ర‌జ‌లు స్థానికంగా ఎదుర్కొనే స‌మ‌స్య‌ల‌ను నేరుగా ప‌రిష్క‌రించేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యాల‌ను సంప్ర‌దించాల‌న్నారు. ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వానికి వార‌ధిగా కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యాలు ఉన్నాయ‌ని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు శీలం సత్యనారాయణ, సురేష్ యాదవ్, జగదీష్ బాబు, నర్సింగ్, కవిత, బాబురావు, నవీన్, భాస్కర్ రెడ్డి, శ్రీనివాస్, దినేష్, చందు, మురళి, సుబ్బారావు, సంపత్, జగన్, హఫీజ్, రాజేష్, అస్లాం, మధు, నరేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page