Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadసిసి రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ ఎ.పావని

సిసి రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ ఎ.పావని

📰 Generate e-Paper Clip

 సిసి రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ ఎ.పావని

హైదరాబాద్, డిసెంబ‌ర్ 18, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ ప‌రిధిలోని భాగ్య‌న‌గ‌ర్ కాంప్లెక్స్ నుంచి ప్ర‌ధాన రోడ్డు వ‌ర‌కు రూ.22 ల‌క్ష‌ల నిధుల‌తో చేప‌ట్టిన నూత‌న సిసి రోడ్డు ప‌నుల‌ను స్థానిక కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని గురువారం ప‌రిశీలించారు. ఈ సంస‌ద‌ర్భంగా స్థానిక వాసుల‌తో మాట్లాడి వారి స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. నూతనంగా స్ట్రీట్ లైట్స్‌ను వేయించాల‌ని, సివరేజి సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుకుని, రోడ్డు నిర్మాణం పనులతో పాటు ఇతర సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని కార్పొరేట‌ర్ పావ‌ని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, జిహెచ్ఎంసి వ‌ర్క్ ఇన్‌స్పెక్ట‌ర్ మహేష్ వారి సిబ్బంది, బిజెపి డివిజన్ అధ్యక్ష, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు న‌వీన్, ఆనంద్‌రావు, బిజెపి నాయకులు దామోదర్, శ్రీకాంత్, రాజు, పి.నర్సింగ్ రావు, సురేష్ రాజు, సాయి కుమార్, అపార్ట్‌మెంట్స్ అసోసియేష‌న్ స‌భ్యులు శ్రవణ్ కుమార్, శేషు, అశోక్, జ్యోతి, అంజన తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page