Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadమంచినీటి, సివ‌రేజి నూతన పైప్‌లైన్ల ఏర్పాటును పరిశీలించిన కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

మంచినీటి, సివ‌రేజి నూతన పైప్‌లైన్ల ఏర్పాటును పరిశీలించిన కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, న‌వంబ‌ర్ 18, అద్దం న్యూస్ :   గత కొన్ని ఏళ్లుగా డివిజన్‌లోని చిక్కడపల్లి ప్రజలు తీవ్రంగా ఎదుర్కొంటున్న మంచినీటి సరఫరా సమస్యల నుండి అతి త్వరలో విముక్తి లభిస్తుందని గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ అన్నారు. గోల్కొండ చౌరస్తా నుంచి ఆర్టీసి క్రాస్ రోడ్స్ వరకు ఏర్పాటు చేసే మంచినీటి పైప్‌లైన్ పనులను సుమారు రూ.55 లక్షలతో, వివి గిరీనగర్ బస్తీలో రూ.12 ల‌క్ష‌ల నిధుల‌తో చేప‌ట్టిన నూతన సేవరెజి పైప్‌లైన్ ప‌నుల ఏర్పాట్లను జలమండలి డిజీఎం కార్తీక్ రెడ్డి, మేనేజర్ కృష్ణ మోహన్ సిబ్బంది, చిక్కడపల్లి ట్రాఫిక్ సిఐ ఏడుకొండలు, ఎస్ఐ శివ కుమార్, బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, బిజెపి నాయకులతో కలిసి రెండు చోట్ల పనులను కార్పొరేటర్ ఎ.పావని పర్యవేక్షించారు. వివి గిరినగర్ బస్తీ వాసుల సివ‌రేజి సమస్యను కూడా 4-6 ఇంచుల‌ పాత పైప్‌లైన్‌ స్థానంలో 10 ఇంచుల‌ నూతన సివ‌రేజి పైప్‌లైన్‌ ఏర్పాటు చేస్తున్నామని కార్పొరేటర్ పావ‌ని తెలిపారు. ప్రజల మంచినీటి, సివ‌రేజి సమస్యలకు శాశ్వత పరిష్కారం కలిగించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని కార్పొరేట‌ర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ ఇన్‌స్పెక్ట‌ర్ శంకర్,జగన్, బిజెపి డివిజన్ అధ్యక్ష, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు నవీన్, ఆనంద్‌రావు, సీనియర్ నేతలు దామోదర్, శ్రీకాంత్, ఎమ్.ఉమేష్, సాయి కుమార్, జ్ఞానేశ్వర్, సాయి కిరణ్ యాదవ్, తరుణ్, స్థానికులు, బస్తీ వాసులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page