హైదరాబాద్, మే 26, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్లోని పలు పార్కుల్లో ఇటీవల మంజూరు చేయించిన 26 లక్షల నిధులతో కొనసాగుతున్న అభివృద్ధి పనులను స్థానిక కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… పలు పార్కుల్లో అభివృద్ధి పనుల కోసం తాను రూ.26 లక్షల నిధులను మంజూరు చేయించడం జరిగిందన్నారు. అందులో భాగంగా డివిజన్లోని జవహర్నగర్ టిఆర్టి గ్రౌండ్ ప్రహరిగోడ నిర్మాణం, సురభి పార్కు, కెనరా పార్కుల్లో పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. వీటితో పాటు పెండింగ్లో ఉన్న ఇతర పార్కుల్లో కూడా అభివృద్ధి పనులను త్వరలో పూర్తి చేయిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ఎ .వినయ్ కుమార్, బీజేపీ సీనియర్ నాయకులు శ్రీకాంత్, డిఎస్.రెడ్డి, ధోనేటి సత్యం, లక్ష్మీనారాయణ, స్థానిక కాలనీ వాసులు జయకుమార్, ప్రకాష్, శ్యామ్, రాజు, జిహెచ్ఎంసి వర్క్ ఇన్స్పెక్టర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.pngఅభివృద్ధి పనులను పరిశీలించిన కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్
RELATED ARTICLES
