హైదరాబాద్, మే 25, అద్దం న్యూస్ : మాదిగ దండోరా,మాల మహానాడు కార్యకర్తలపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ సమయంలో మాదిగ దండోరా, మాల మహానాడు కార్యకర్తలపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ బంధు సొసైటీ హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో సదస్సు జరిగింది. బంధు సొసైటీ హైదరాబాద్ అధ్యక్షుడు పల్లేల వీరస్వామి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఐఆర్ఎస్ భరత్ భూషణ్, ప్రొఫెసర్లు ముత్తయ్య, నథానియేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… 30 సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటం తర్వాత షెడ్యూల్డ్ కులాల ఉమ్మడి రిజర్వేషన్లను ఆర్థిక, సాంఘిక వెనకబాటు ఆధారంగా గ్రూపులుగా వర్గీకరించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని 2024 ఆగస్టు 1 న సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ తీర్పునకు అనుకూలంగా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు షెడ్యూల్డ్ కులాల ఉమ్మిడి రిజర్వేషన్లను మూడు గ్రూపులుగా వారి వారి జనాభా నిష్పత్తి ప్రకారం వర్గీకరించారన్నారు. రెండు తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులకు బంధు సొసైటీ ధన్యవాదాలు తెలుపుతుందన్నారు. 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాట సమయంలో వర్గీకరణకు మద్దతుగా మాదిగ దండోరా కార్యకర్తలు, వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు కార్యకర్తలు నిర్వహించిన నిరసనలు, ధర్నాలు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్‌స్టేషన్ల పరిధిలో కేసులు పెట్టారన్నారు. ఉద్యోగానికి అర్హత కలిగిన అభ్యర్థులపై కేసు ఉండటం వల్ల ఉద్యోగాలు కోల్పోవడం జరుగుతున్నాయన్నారు. ఈ విషయాలను మానవతాధృక్ఫథంతో కేసులను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ఈ సదస్సులో బంధు సొసైటీ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి దేవానాధం, కోశాధికారి వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు అంకుషయ్య, పల్లాటి ఆంజనేయులు, నర్సింగ్‌రావు, బహుజన రాజ్యాధికార సమితి అధ్యక్షుడు వశపాక నర్సింహా తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply