Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadవిడిసిసి రోడ్డు ప్యాచ్ వ‌ర్క్ ప‌నుల‌ను ప‌రిశీలించిన కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

విడిసిసి రోడ్డు ప్యాచ్ వ‌ర్క్ ప‌నుల‌ను ప‌రిశీలించిన కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, నవంబర్ 26, అద్దం న్యూస్ : హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ టెలిఫోన్ ఎక్సేంజ్ ప‌క్క‌న వీధిలో బుధ‌వారం విడిసిసి రోడ్డు ప్యాచ్ వ‌ర్క్ ప‌నులు ప్రారంభ‌మ‌య్యాయి. ఈ ప‌నుల‌ను జిహెచ్ఎంసి ఏఈ అబ్దుల్ స‌లామ్‌, వ‌ర్క్ ఇన్‌స్పెక్ట‌ర్ మ‌హేష్‌ల‌తో క‌లిసి గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని విన‌య్ కుమార్ ప‌ర్య‌వేక్షించారు. ఈ సంద‌ర్భంగా కార్పొరేటర్ పావ‌ని మాట్లాడుతూ… స్థానికులు వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని అందిన ఫిర్యాదు మేరకు 50 మిటర్ల వెడల్పు విడిసిసీ రోడ్డు ప్యాచ్ వర్క్ పనులు జరిపిస్తున్నామ‌న్నారు. డివిజన్‌లో మరికొన్ని చోట్ల కూడా నూతన రోడ్డు నిర్మాణం, ప్యాచ్ వర్క్ పనులను శరవేగంగా జరుతున్నాయని, త్వరలో ఎక్కడ గుంతలు లేని రోడ్లతో గాంధీనగర్ డివిజన్‌ను అభివృద్ధి చేస్తామని కార్పొరేటర్ పావ‌ని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ శ్రీ ఎ.వినయ్ కుమార్, బిజెపి డివిజన్ అధ్యక్ష‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు న‌వీన్, ఆనంద్‌రావు, బిజెపి నాయకులు దామోదర్, శ్రీకాంత్, పి.నర్సింగ్ రావు, సాయి కుమార్, నీరజ్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page