హైదరాబాద్, మే 24, అద్దం న్యూస్ : ఎంటమోలజీ విభాగం సిబ్బంది తో మస్కిటో ఫాగ్ స్పెషల్ డ్రైవ్, పిన్ పాయింట్ కార్యక్రమాన్ని గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ పరిశీలించారు. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం వారంలో ఒక రోజు కాకుండా, పాత విధానాన్ని కొనసాగిస్తూ ప్రతి రోజూ ఫాగ్ వెహికల్, ఒక హాండ్ పంప్ సిబ్బందితో పనులు జరిపించాలని కార్పొరేటర్ పావని అన్నారు. వారంలో ఒక్కో రోజు ఒక్కో డివిజన్‌లో ఫాగ్ స్ప్రే జరిగితే మిగిలిన రోజుల్లో ఫిర్యాదులు ఎక్కువ అయ్యే అవకాశం ఉందని. పాత పద్ధతిని కొనసాగిస్తూ ప్రతి రోజూ ఫాగ్ స్ప్రే చేయడమే కాకుండా, హ్యాండ్ పంప్ మిషన్లను, సిబ్బందిని పెంచే చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ పావని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, ఫాగ్ స్ప్రే సూపర్‌వైజర్ మహేష్, సిబ్బంది పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply