ఉచిత టైలరింగ్ శిక్షణ శిబిరం వార్షికోత్సవంలో పాల్గొన్న కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

ఉచిత టైలరింగ్ శిక్షణ శిబిరం వార్షికోత్సవంలో పాల్గొన్న కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

హైదరాబాద్, జులై 22, అద్దం న్యూస్ :   ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ చిక్క‌డ‌ప‌ల్లి బాపూన‌గ‌ర్‌లో గ‌ల మ‌హిళా భ‌వ‌న్‌లో ల‌య‌న్స్ క్ల‌బ్ ఆఫ్ సికింద్రాబాద్ ప్యార‌డైజ్‌, నివి చారిట‌బుల్ ట్ర‌స్టీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మ‌హిళ‌ల‌కు కుట్టు మిష‌న్లు, మ‌గ్గంలో ఉచిత శిక్ష‌ణ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన సంవ‌త్స‌రం పూర్తి అయిన సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం వేడుక‌లు జ‌రిగాయి. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని విన‌య్ కుమార్ హాజ‌రై శిక్ష‌ణ‌లు పూర్తి చేసుకున్న మ‌హిళ‌ల‌కు స‌ర్టిఫికెట్ల‌ను అంద‌చేశారు. ఈ సంద‌ర్భంగా కార్పొరేట‌ర్ పావ‌ని మాట్లాడుతూ… మహిళలకు స్వయం ఉపాధి కల్పించడం కొరకు డివిజన్‌లో రెండు చోట్ల ఉచిత శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు సహకరించిన లయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ ప్యారడైజ్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వారితో పాటు తమ నివి చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా మరిన్ని ఉచిత శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఇప్పటి నాలుగు బ్యాచ్ లు పూర్తి చేసుకున్న శిక్షణ కేంద్రంలోని మహిళలకు లయన్స్ క్లబ్ ప్రతినిధి కల్లూరి శ్రీనివాస్ పికొ మిషన్లను అందచేసారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ. వినయ్ కుమార్, లయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ ప్యారడైజ్ అధ్యక్షుడు చంద్రమోహన్, కార్యదర్శులు సుమన్, కోశాధికారి విజయేందర్ రెడ్డి, ప్రాజెక్టు ఛైర్మెన్ సెరిపల్లి గణేష్, సభ్యులు కమలాకర్, కాసం,హేమంత్, ప్రకాష్, బీజేపీ నేతలు దామోదర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page