హైదరాబాద్, అద్దం న్యూస్ : హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీజేపీ తరపున గౌతమ్ రావు ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్‌కుమార్ ఆధ్వర్యంలో గౌతమ్‌రావుకు మద్దతు తెలిపి ఆయనను ఘనంగా సన్మానించారు. జరగబోయే స్థానిక సంస్థల ఎమ్మెల్సి ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి గౌతమ్‌రావుకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని కార్పొరేటర్ పావని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి మహాంకాళి జల్లా అధ్యక్షుడు భరత్‌గౌడ్, బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, జిహెచ్ఎంసి బిజెపి ఫ్లోర్ లీడర్ శంకర్ యాదవ్, బిజెపి నాయకులు రమేష్ యాదవ్, వి.నవీన్ కుమార్, నేతలు శ్రీకాంత్, సాయి కుమార్, సంతోష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply